ర్యాలీ బాటలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ 

ర్యాలీ బాటలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ 

బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆభరణాలపై రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ కౌంటర్ సైతం ర్యాలీ బాటలో సాగుతోంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో తొలుత 3.5 శాతం జంప్‌చేసింది. రూ. 613కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం రూ. 611 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాక గత ఐదు వారాలలో ఈ షేరు 26 శాతం లాభపడింది. గతేడాది అక్టోబర్‌ 9న నమోదైన ఏడాది కనిష్టం రూ. 357 నుంచీ ఈ షేరు 71 శాతం ర్యాలీ చేసింది. ఇతర వివరాలు చూద్దాం..

క్యూ3 ఓకే
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 485 కోట్లను తాకింది. అయితే తొలి 9 నెలల్లో(ఏప్రిల్-డిసెంబర్) నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1460 కోట్లకు చేరింది. కాగా.. వడ్డీ వసూళ్లను రెగ్యులర్‌గా చేపడుతుండటం, వ్యయాలను అదుపులో ఉంచడం వంటి సానుకూలతల కారణంగా లెండింగ్‌ ఈల్డ్స్‌ మెరుగ్గా నమోదవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. Most Popular