సెన్సెక్స్‌ సెంచరీ- మెటల్‌, ఫార్మా అప్‌

సెన్సెక్స్‌ సెంచరీ- మెటల్‌, ఫార్మా అప్‌

రెండు రోజులుగా ర్యాలీ బాట పట్టిన దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరుగా ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. ప్రస్తుతం 114 పాయింట్లు పెరిగి 37,866కు చేరింది. నిఫ్టీ సైతం 29 పాయింట్లు ఎగసి 11,371 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అంచనాలతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. బుధవారం అమెరికా మార్కెట్ నీరసించగా.. యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ నెలకొంది. 

మీడియా జోరు
బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, మెటల్, ఫార్మా, బ్యాంక్‌ నిఫ్టీ 1.5-0.5 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, జీ, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, సన్‌ ఫార్మా 3.3-1 శాతం మధ్య పెరిగాయి. అయితే హెచ్‌పీసీఎల్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌, ఐషర్‌, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, అదానీ పోర్ట్స్‌ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. మీడియా కౌంటర్లలో డెన్‌, జీ, జీ మీడియా, పీవీఆర్‌, యుఫో, సన్‌ టీవీ, టీవీ 18 బ్రాడ్‌క్యాస్ట్‌ 3.5-0.5 శాతం మధ్య లాభపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో దివాన్‌ హౌసింగ్‌, టాటా గ్లోబల్‌, ఐబీ హౌసింగ్‌, ఐసీఐసీఐ ప్రు, జీ, యస్‌బ్యాంక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఇన్ఫీబీమ్‌, మహానగర్‌ గ్యాస్‌, పీసీ జ్యువెలర్స్‌ 4.25-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క రిలయన్స్ కేపిటల్‌, ఆర్‌పవర్‌, వోల్టాస్‌, నెస్లే, జెట్‌ ఎయిర్‌, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్‌ ఇన్ఫ్రా, ఎన్‌సీసీ 2.7-1.2 శాతం మధ్య నష్టపోయాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకూ డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.25 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 923 లాభపడగా.. 554 మాత్రమే వెనకడుగులో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో దీప్‌ ఇండస్ట్రీస్‌, ద బైక్‌, టాటా కాఫీ, విశాల్‌, జియోజిత్‌, రెడింగ్టన్‌, స్టార్‌ సిమెంట్‌, కేపిటల్‌ ట్రస్ట్‌, కేఎస్‌ఈ, ఎమ్‌కే, యాడ్‌ల్యాబ్స్‌, మారథాన్‌, ఇగార్షీ తదితరాలు 12-5 శాతం మధ్య జంప్‌ చేశాయి.Most Popular