ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా  ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ నామమాత్రంగా 5 పాయింట్లు క్షీణించి 11,379 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 216 పాయింట్లు పెరిగి 37,752 వద్ద ముగిసింది. 40 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 11,341 వద్ద స్థిరపడింది. కాగా.. బ్యాంక్‌ నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 28834 వద్ద ముగిసింది. కాగా.. బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,295 పాయింట్ల వద్ద, తదుపరి 11,248 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,370 పాయింట్ల వద్ద, తదుపరి 11,399 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీకి 28516, 28148 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని.. ఇదే విధంగా 29090, 29296 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2722 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1508 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.