మళ్లీ జోష్‌తో ముగిసిన మార్కెట్లు

మళ్లీ జోష్‌తో ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లో లాభాల ట్రెండ్ కొనసాగుతోంది. పలు షేర్లు రికార్డు గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ ఆల్-టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఆరంభంతో పోల్చితే, సూచీల లాభాలు అంతకంతకూ పెరిగాయి. ట్రేడింగ్ ముగిసేసరికి... ఇండెక్స్‌లు చాలా స్ట్రాంగ్‌గా క్లోజయ్యాయి.

216 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 37752 వద్ద ముగిసింది. 40 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 11341 దగ్గర క్లోజయింది. 440 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 28834 వద్ద ట్రేడింగ్ ముగించుకుంది.

బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. ఎఫ్ఎంసీజీ కూడా పాజిటివ్‌గా ముగిసింది. మొత్తం మీద మార్కెట్‌కు ఇవాళ బ్యాంకింగ్ షేర్లు దారి చూపించాయి.

నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌పీసీఎల్ షేర్‌లు టాప్ గెయినర్‌లుగా నిలవగా... భారతి ఇన్‌ఫ్రాటెల్, వేదాంత, ఐఓసీ, జీ ఎంటర్టెయిన్మెంట్, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్‌లుగా నిలిచాయి.