సెన్సెక్స్ డ'బుల్' సెంచరీ

సెన్సెక్స్ డ'బుల్' సెంచరీ

స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో... సెన్సెక్స్ స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి హెవీ వెయిట్ స్టాక్స్ రికార్డు గరిష్టాలను అందుకోవడంతో... ఆ జోరు మార్కెట్లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం 0.5 శాతం లాభపడిన సెన్సెక్స్ 37720 వద్ద ట్రేడవుతుండగా.. 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 1328 వద్ద నిలిచింది. 400 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 28826 వద్ద నిలిచింది.

ఐటీ, మిడ్‌క్యాప్‌లు మాత్రమే నెగిటివ్‌గా ఉండగా... దాదాపు మిగిలిన అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి. నిఫ్టీలో యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ గెయినర్‌లుగా ఉండగా... వేదాంత, భారతి ఎయిర్‌టెల్, ఇండియన్ ఆయిల్, జీ ఎంటర్‌టెయిన్‌మెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.Most Popular