సెన్సెక్స్ సెంచరీ, నిఫ్టీ @ 11300

సెన్సెక్స్ సెంచరీ, నిఫ్టీ @ 11300

స్టాక్ మార్కెట్లో లాభల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ప్రధాన ఇండెక్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండడంతో, సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఉదయం కొంత ఒత్తిడి కనిపించినా, మిడ్ సెషన్ సమయానికి ఇండెక్స్‌లు లాభాలను అందుకుంటున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లాభాలు కొనసాగగా... రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ కౌంటర్లు కూడా ఇదే ట్రెండ్ కనబరుస్తున్నాయి. బజాజ్ కన్జూమర్ కేర్ 12 శాతం పైగా నష్టాలు నమోదు చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 3 రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 37360 వద్ద ఉండగా... 11 పాయింట్లు మాత్రమే లాభపడిన నిఫ్టీ 11312 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం 8 పైసలు బలపడి రూ.69.63/డాలర్ వద్ద నిలిచింది. బ్రెంట్ క్రూడ్ ధర 66.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా... ఐఓసీ, వేదాంత, జీ ఎంటర్టెయిన్మెంట్, ఇండియాబుల్స్ హౌసింగ్, ఎన్టీపీసీలు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.Most Popular