రికార్డ్ గరిష్టానికి యాక్సిస్ బ్యాంక్

రికార్డ్ గరిష్టానికి యాక్సిస్ బ్యాంక్

వరుసగా మూడో సెషన్‌లోనూ యాక్సిస్ బ్యాంక్ పరుగులు తీస్తోంది. దీంతో ఈ షేర్ ధర రికార్డ్ గరిష్టాన్ని అందుకుంది. మూడేళ్ల వ్యవధితో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా రాకేష్ మఖీజాను నియమిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

జూలై 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాకుండగా డా. సంజీవ్ మిశ్రా స్థానంలో రాకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎస్‌కేఎఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా ఉన్న ఈయన, రెండు టాటా గ్రూప్ కంపెనీలకు, యాక్సిస్ బ్యాంక్‌లో ఒక విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు.

ఈ నియామకం ప్రభావంతో యాక్సిస్ బ్యాంక్ కౌంటర్ కళకళలాడుతోంది. ఒక దశలో 1.1 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ ఆల్-టైం హై స్థాయిని చేరుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 0.34 శాతం పెరిగిన ఈ షేర్ రూ. 744.30 వద్ద ట్రేడవుతోంది.Most Popular