రేటింగ్ అప్‌గ్రేడ్‌తో డీఎల్ఎఫ్‌కు లాభాలు

రేటింగ్ అప్‌గ్రేడ్‌తో డీఎల్ఎఫ్‌కు లాభాలు

డీఎల్ఎఫ్ షేర్‌కు సెల్ నుంచి బయ్‌కు రేటింగ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సీఎల్ఎస్ఏ వెల్లడించింది. ఇదే సమయంలో టార్గెట్ ధరను రూ. 167 నుంచి రూ. 229కి పెంచుతున్నట్లు తెలిపింది.

రేటింగ్ అప్‌గ్రేడ్ ప్రభావంతో ఈ కౌంటర్‌లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇవాల్టి ట్రేడింగ్ ప్రారంభంలోనే ఈ షేర్ ధర 3.8 శాతం జంప్ చేసింది. ప్రస్తుతం డీఎల్ఎఫ్ షేర్ ధర 3.55 శాతం లాభంతో రూ. 193.80 వద్ద ట్రేడవుతోంది. 

స్టాక్‌లో మరికొంతకాలం పాజిటివ్ ట్రెండ్ కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.Most Popular