కొనసాగుతున్న లాభాల ట్రెండ్

కొనసాగుతున్న లాభాల ట్రెండ్

ఇవాళ దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నా... దేశీయంగా మన మార్కెట్లు ర్యాలీ చేస్తుండడం, దేశీయ మార్కెట్లకు సానుకూలంగా ఉంది.

సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో ప్రారంభం కాగా నిఫ్టీ 10 పాయింట్లను ఆరంభంలో ఆర్జించింది. అయితే, ట్రేడర్‌లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో, అంతలోనే సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే లోయర్ లెవెల్స్‌లో మరొసారి కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది.

మార్కెట్లో అడ్వాన్స్‌లు, డిక్లైన్‌లు దాదాపు సమానంగా కనిపిస్తున్నాయి. నిఫ్టీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు టాప్ గెయినర్స్‌గా ఉండగా... ఇండియన్ ఆయిల్, ఓఎన్‌జీసీ, వేదాంత, జీ ఎంటర్టెయిన్మెంట్, కోల్ ఇండియాలు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.Most Popular