స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 13)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 13)
 • మరో రూ.2,337.88 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించిన ఎస్‌బీఐ
 • మార్చి 26న ఆరు ఖాతాలకు చెందిన ఈ నిరర్థక ఆస్తుల వేలం
 • ఇప్పటికే రూ.1,307.27 కోట్ల నిరర్థక ఆస్తులను ఈనెల 22న వేలం వేయనున్నట్టు ప్రకటించిన ఎస్‌బీఐ
 • రూ.661 కోట్ల నిధులు సమీకరించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
 • యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా రాకేశ్‌ మఖిజా
 • డా.సంజీవ్‌ మిశ్రా స్థానంలో జూలై 18న పగ్గాలు చేపట్టనున్న  రాకేశ్‌ మఖిజా
 • HDFC లైఫ్‌ ఇన్సూరెన్స్‌ OFSకు తొలిరోజూ నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 2.6 రెట్ల స్పందన
 • బయోకాన్‌కు షాక్‌, యూఎస్‌ ఎఫ్‌డీఏ నుంచి రెండు అభ్యంతరాలతో ఫామ్‌-483 అందుకున్న బయోకాన్‌
 • భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 32శాతం వాటా విక్రయం కోసం బోర్డు అనుమతి పొందిన భారతి ఎయిర్‌టెల్‌
 • ఒక్కో షేరుకు రూ.5.52 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన ఎన్‌ఎండీసీ, రికార్డు తేదీ మార్చి 25
 • తమ క్రెడిట్‌ సర్వీసెస్‌ సంస్థలో రూ.30 కోట్లతో  10.29 శాతం వాటా పెంచుకున్న టీవీఎస్‌ మోటార్స్‌
 • అండర్‌గ్రౌండ్‌ పవర్‌ కేబుల్స్‌ సరఫరా కోసం తొలిసారిగా మారిషస్‌ నుంచి ఎగుమతి ఆర్డర్‌ పొందిన సీఎంఐ
 • హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, యూపీల్లో కొత్తగా 3 స్టోర్లను ప్రారంభించిన వీ-మార్ట్‌, దీంతో దేశవ్యాప్తంగా 207కు చేరిన స్టోర్ల సంఖ్య
 • మాట్రిమోని డాట్‌కామ్‌ ప్రైస్‌బాండ్‌ 10శాతానికి సవరింపు
 • సంధానా నిట్రో కెమ్‌ ప్రైస్‌బాండ్‌ 2శాతానికి సవరింపు
 • ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి IL&FS ట్రాన్స్‌పోర్టేషన్‌, ఎస్‌పీఎల్‌ ఇండస్ట్రీస్‌, శంకరా బిల్డింగ్స్‌, సిటి నెట్‌వర్క్స్
 • ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి ఆర్‌కామ్, మహామాయ స్టీల్‌, కాంటబిల్‌ రిటైల్‌, క్వాలిటీ‌, ఎక్సెల్‌ రియాల్టీ


Most Popular