5 నెలల్లో బెస్ట్ ర్యాలీ ! రికార్డ్‌లు బ్రేక్ చేసిన బ్యాంక్ నిఫ్టీ

5 నెలల్లో బెస్ట్ ర్యాలీ ! రికార్డ్‌లు బ్రేక్ చేసిన బ్యాంక్ నిఫ్టీ

స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాల్లో ముగిసింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, రిలయన్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ స్థాయిలో పరుగులు తీశాయి. రూపాయి బలం పుంజుకోవడం, ఎఫ్ఐఐల నిధుల వరద వంటివన్నీ కలిసొచ్చాయి. నిఫ్టీ 11300 పాయింట్ల మార్కును క్రాస్ చేసి మరీ దానిపైనే ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ తన జీవిత కాల గరిష్ట స్థాయి 28,488 పాయింట్ల మార్కును టచ్ చేసింది. మొత్తానికి ఈ రోజు వచ్చిన బ్రాడ్ బేస్డ్ ర్యాలీ సెంటిమెంట్‌ను మరింత బూస్ట్ చేసింది. చివరకు నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 11301 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 477 పాయింట్లు, సెన్సెక్స్ 481 పాయింట్లు లాభపడ్డాయి. 

ఉదయం లాభాలతో 11,231 పాయింట్ల దగ్గర  ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్ తర్వాత వేగం పుంజుకుంది. ఇంట్రాడేలో 11320 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివర్లో కొద్దిగా తడబడినా కంఫర్టబుల్‌గా 11301 దగ్గర ముగిసింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. 
భారతి ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, అదానీ పోర్ట్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. 

బ్రాడ్‌బేస్డ్ ర్యాలీ
రూపాయి బలం పుంజుకోవడంతో ఐటీ స్టాక్స్ నీరసించడం మినహా మిగిలిన్ని అన్ని రంగాలూ జోరును ప్రదర్శించాయి. ప్రధానంగా రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసిజి రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాల్లోనే ముగిశాయి. 

టాప్ స్టాక్స్ రికార్డ్ రన్
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, టీటీకే ప్రెస్టీజ్, యూపీఎల్, పీఐ  ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్, కర్నాటక బ్యాంక్, బజాజ్ హోల్డింగ్స్, బాటా ఇండియా, దివీస్ ల్యాబ్స్, గోద్రెజ్ ఫిలిప్స్ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. వీటితో పాటు మొత్తం 28 స్టాక్స్ ఈ ఫీట్‌ను చేశాయి. 

ఎయిర్టెల్ గాల్లో తేలుతోంది
భారతి ఎయిర్టెల్ షేర్ గత రెండు రోజుల్లో ఏకంగా 14 శాతం పెరిగింది. రైట్స్ ఇష్యూకు ప్రమోటర్ గ్రూప్ నుంచే మంచి స్పందన రావడంతో పాటు ఇన్ఫ్రాటెల్‌లో వాటాలకు సంబంధించి వార్తలు వెలువడడం ఈ స్టాక్‌లో లాభాలను పెంచింది. ఈ రోజు కూడా స్టాక్ 5.4 శాతం పెరిగి రూ.351.80 దగ్గర క్లోజైంది. వాల్యూమ్స్‌లో కూడా మంచి జంప్ నమోదైంది. 

హెచ్ డి ఎఫ్ సి లైఫ్... రెండో రోజూ..
రెండో రోజు కూడా వరుసగా హెచ్ డి ఎఫ్ సి లైఫ్ స్టాక్ నష్టపోయింది. ఈ రోజు ఏకంగా 5 శాతం పతనమైంది. మారిషస్ హోల్డింగ్స్ సంస్థ స్టాండర్ లైఫ్.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.95 కోట్ల షేర్లను అమ్మింది. రూ.357తో ఫ్లోర్ ప్రైస్‌ను నిర్ణయించిన సంస్థ దీని ద్వారా రూ.3557 కోట్లను సమీకరించబోతోంది. స్టాండర్డ్ లైఫ్ వాటాల అమ్మకంతో ఈ స్టాక్ చివరకు 4.71 శాతం తగ్గి రూ.371.45 దగ్గర క్లోజైంది. 

7 నెలల గరిష్టానికి కెఈఐ ఇండస్ట్రీస్
కెఈఐ ఇండస్ట్రీస్ గత కొన్ని రోజుల నుంచి లైమ్‌లైట్‌లో ఉంది. ఐదు రోజుల్లో 14 శాతం, నెల రోజుల్లో 24 శాతం పెరిగింది. ఈ రోజు కూడా 10 శాతం వరకూ పెరిగి ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరింది ధర. చివరకు స్టాక్ రూ. 432.10 దగ్గర క్లోజైంది. Most Popular