రికార్డ్ గరిష్టానికి బ్యాంక్ నిఫ్టీ

రికార్డ్ గరిష్టానికి బ్యాంక్ నిఫ్టీ

బ్యాంక్ నిఫ్టీ ఇవాళ భారీ పరుగులను కొనసాగిస్తోంది. మార్కెట్లు లాభాల్లో ఉండడం, బ్యాంకింగ్ కౌంటర్లలో ఎక్కువగా బయ్యింగ్ జరుగుతుండడం... బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌ను రికార్డుల దరికి చేర్చింది.
ప్రస్తుతం కూడా అదే ఊపును కొనసాగిస్తోన్న ఈ సెక్టార్... ఏకంగా 460 పాయింట్లు జంప్ చేసింది.

ప్రస్తుతం 458 పాయింట్ల లాభంతో 28425 పాయింట్లకు చేరుకుని, ఆల్‌టైం రికార్డు వద్ద ట్రేడవుతోంది.

ఐటీ మినహా మిగిలిన అన్ని సెక్టార్లు పాజిటివ్‌గానే ఉన్నాయి.

సెన్సెక్స్ ఏకంగా 450 పాయింట్ల లాభంతో 37504 వద్ద ట్రేడవుతోంది. 130 పాయింట్లు పెరిగిన నిఫ్టీ...11298 వద్ద నిలిచింది.Most Popular