ఆల్‌టైం గరిష్టానికి టైటాన్, ! 8.4శాతం పెరిగిన ప్రిజమ్ జాన్సన్ !

ఆల్‌టైం గరిష్టానికి టైటాన్, ! 8.4శాతం పెరిగిన ప్రిజమ్ జాన్సన్ !

దేశీయ మార్కెట్లలో ఉగాది ముందుగానే వచ్చినట్టుంది. సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్ రంగంలోని 80శాతం స్టాక్స్ లాభాల బాటలో పయనిస్తున్నాయి. తాజాగా టైటాన్ కంపెనీ షేర్ 2.5శాతం పెరిగి రూ.1,095.95 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఆల్ టైం గరిష్టమని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం టైటాన్ స్టాక్స్ 17.2శాతం రిటర్న్స్ ను మదుపర్లకు అందించింది. గత 12 నెలల కాలంలో 32.2శాతం రిటర్న్స్ రావడం గమనార్హం. 
Live: Sensex Surges Nearly 400 Points; Rupee Wipes Out 2019 Losses
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం నాటి మార్కెట్ ప్రారంభ సమయంలో ప్రిజమ్ జాన్సన్ హెవీ వాల్యూమ్స్‌తో ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్స్ 8.4శాతం పెరిగి రూ. 104 వద్ద నమోదైంది. ఎర్నింగ్స్ పర్ షేర్ కింద ఈ స్టాక్స్ 21.1 సార్లు ట్రేడ్ అయ్యాయి. 30 డేస్ యావరేజ్ కింద చూస్తే.. ట్రేడింగ్ వాల్యూమ్ 73.3 సార్లు నమోదైంది. 
Image result for prism johnsonMost Popular