వరుసగా మూడో సెషన్‌లోనూ అప్.. రికార్డు గరిష్టానికి టైటాన్

వరుసగా మూడో సెషన్‌లోనూ అప్.. రికార్డు గరిష్టానికి టైటాన్

వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోను టైటాన్ కంపెనీ షేర్లు లాభాలను గడిస్తున్నాయి. ఇవాల్టి ట్రేడింగ్‌లో 2.5 శాతం పెరిగిన టైటాన్... కొత్త ఆల్ టైం హై స్థాయిని చేరుకుంది.

ఒక దశలో రూ. 1095.95కు చేరుకున్న టైటాన్... ప్రస్తుతం 2.25 శాతం లభాంతో రూ. 1092 వద్ద ట్రేడవుతోంది.

యూఎస్‌లో వాచ్‌ల తయారీ కోసం ఎఫ్‌టీఎస్‌తో టైటాన్ తాజాగా ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకూ ఈ ఏడాది 17 శాతం లాభపడిన టైటాన్.. గత 12 నెలల సమయంలో 32 శాతం రిటర్న్‌లను ఈ షేర్ ఇవ్వడం విశేషం.Most Popular