భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయ ఇన్వెస్టర్‌ల నుంచి లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో... ఇవాళ మన మార్కెట్లు ఆరంభం నుంచి దూకుడు చూపిస్తున్నాయి.

ప్రస్తుతం 0.92 శాతం లాభపడిన సెన్సెక్స్ 341 పాయింట్లు వృద్ధి చెంది 37395 వద్ద నిలిచింది. 0.89 శాతం ఊపందుకున్న నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 11266.90 వద్ద ట్రేడవుతోంది.

1 శాతం మేర లాభపడిన నిఫ్టీ బ్యాంక్ 28237.20 వద్దకు చేరుకుంది. అన్ని సెక్టోరియల్ ఇండెక్స్‌లు మంచి లాభాలను గడిస్తున్నాయి. 

కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు ఒకటిన్నర శాతం పైగా పెరిగాయి. 

నిఫ్టీలో ఎన్‌టీపీసీ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, ఎల్ అండ్ టీ షేర్‌లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.

భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, యూపీఎల్ షేర్లు టాప్ లూజర్స్‌గా ట్రేడవుతున్నాయి.Most Popular