స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 12)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (మార్చి 12)
 • ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా 7 కోట్ల షేర్లను విక్రయించనున్న హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ అనుబంధ సంస్థ మారిషస్‌ హోల్డింగ్స్‌
 • వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధనం కింద రూ.3,800 కోట్లను సమీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న ఎన్‌హెచ్‌పీసీ
 • వచ్చే ఐదేళ్ళ కాలానికి సంస్థ ఎండీగా వేణు శ్రీనివాసన్‌ను తిరిగి నియమించిన సుదరం క్లేటన్ 
 • కార్పొరేషన్‌ బ్యాంక్‌కు రూ.1 కోటి జరిమానా విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
 • 2,500 యూనిట్ల ఆర్డర్‌ను సంపాదించిన టాటామోటార్స్‌
 • వివిధ సంస్థల నుంచి రూ.601.21 కోట్ల ఆర్డర్లను సంపాదించిన పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌
 • శ్రీ శుభం లాజిస్టిక్స్‌లో 71.52 శాతం నుంచి 80.06 శాతానికి  వాటాను పెంచుకున్న కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌
 • డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్వతంత్ర డైరెక్టర్‌ వీకే చోప్రా రాజీనామా
 • ASM ఫ్రేమ్‌వర్క్‌లోకి అడ్వాన్డ్స్‌ ఎంజైమ్‌, ఖాదిమ్ ఇండియా, ఓరికాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌
 • తిరుమలాయ్‌ కెమికల్స్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5 శాతానికి తగ్గింపు
 • నాగ్‌పూర్‌ విమానాశ్రయ నిర్వహణ పనులను దక్కించుకున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా సబ్సిడరీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌
 • తమ ఘజియాబాద్‌ ప్లాంట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ ఎలాంటి లోపాలు గుర్తించలేదని తెలిపిన యూనికెమ్‌ ల్యాబ్స్‌
 • కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌కు రూ.1,288 కోట్ల ఆర్డర్లు
 • ముంబాయిలో హాస్పిటల్‌ను పునర్‌నిర్మించేందుకు రూ.484 కోట్ల ఆర్డర్‌ను పొందిన కెపాసైట్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌
 • రాయ్‌పుర్‌ స్మార్ట్‌ సిటీ నుంచి రూ.700 కోట్ల విలువైన ఆర్డర్లు పొందిన ఎన్‌బీసీసీ
 • గ్రీన్‌కోకు చెందిన పూవని పవర్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో 46% వాటాను కొనుగోలు చేసిన సీమెన్స్‌ ఫైనాన్షియల్‌ 
 • రెండో మధ్యంతర డివిడెండు కింద ఒక్కో షేరుకు రూ.1.40 ఇచ్చేందుకు అంగీకరించిన టీవీఎస్‌ మోటార్‌ బోర్డు


Most Popular