గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థల చూపు దేశీయ మార్కెట్లపైనే..! బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్స్..!

గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థల చూపు దేశీయ మార్కెట్లపైనే..! బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్స్..!

అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఇప్పుడు భారతీయ మార్కెట్లపై అపార ప్రేమను కురిపిస్తున్నాయి. HSBC, BNP పారిబాస్ , మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీలు ఇండియన్ ఈక్విటీల మీద బుల్లిష్ ట్రెండ్‌ను చూపిస్తున్నాయి. HSBC బ్రోకింగ్ సంస్థ భారతీయ మార్కెట్లకు 'నేచురల్ రేటింగ్' నుండి 'ఓవర్ వెయిట్' రేటింగ్స్ ను ఇచ్చింది. ఫైనాన్షియల్, మెటల్, కన్జ్యూమర్స్ రంగాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం, ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం కనుక ఏర్పడితే.. ఈ బుల్లిష్ నెస్ మరింత ఎక్కువగా కనబడొచ్చన్నది ఎనలిస్టుల భావన. సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థ కూడా ఈ 2019 లో కొంత బెటర్ పెర్ఫార్మెన్స్ కనబరచడంతో పలు స్టాక్స్ మంచి ఫలితాలను కనబరుస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, NBFCలకు, PSU బ్యాంకులకు నగదు లభ్యత దొరకడం, ఆర్బీఐ పటిష్ట చర్యలు వంటివి దేశీయ మార్కెట్లను పుంజుకునేలా చేశాయి. దీంతో విదేశీ  ఇన్వెస్టర్లు, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు దేశీయ మార్కెట్లపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. 
సెన్సెక్స్ 40,000 పాయింట్లను తాకనుందా? 
S&P BSE సెన్సెక్స్ ర్యాలీని కొనసాగించవచ్చని, రానున్న రోజుల్లో సెన్సెక్స్ 40,000 పాయింట్లను టచ్ చేయొచ్చని , ఇండెక్స్ సూచీలు దాదాపు 8.3శాతం వృద్ధిని కనబరచవచ్చని BNP పారిబాస్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కొంత అస్థిరత కనబడ్డా.. ఆతరువాత మాత్రం ఇండెక్స్ సూచీలు వేగంగా పుంజుకుంటాయని పారిబాస్ సంస్థ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూలు ఎప్రిల్ 11 నుండి మే 19 వరకు ఉండటంతో  జూన్ నుండి దేశీయ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తాయన్న ఆశాభావాన్ని గ్లోబల్ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. 
ఈ 5 స్టాక్స్ ప్రభావవంతంగా ఉంటాయి..!
HSBC, మోర్గాన్ స్టాన్లీ  అంచనా ప్రకారం కార్పోరేట్ ఎర్నింగ్స్ గ్రోత్ 24.5శాతం ఉండొచ్చని,  టాప్ 5 కంట్రిబ్యూటర్స్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, టాటా మోటార్స్ ఉంటాయని ఈ రెండు గ్లోబల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 
స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితేనే..? 
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ పార్టీ మెజారిటీని సాధిస్తే.. నిఫ్టీ 50 11,900 పాయింట్లను తాకొచ్చని, లేదా బీజేపీ సంకీర్ణం అధికారంలోకి వస్తే.. 9,400-11,300 మధ్య నిఫ్టీ సూచీలు ఉంటాయని గ్లోబల్ బ్రోకింగ్ సంస్థ UBS పేర్కొంది. స్థిరమైన ప్రభుత్వం ఉంటే.. మార్కెట్లు వేగంగా పుంజుకుంటాయని, అస్థిర ప్రభుత్వం లేదా, సంకీర్ణం ఏర్పడితే.. మార్కెట్ వయలేషన్స్ తప్పకపోవచ్చని గ్లోబల్ సంస్థలు, ఎనలిస్టులు భావిస్తున్నారు. 

Disclaimer: పైన పేర్కొన్న సూచనలు, అభిప్రాయాలు నిపుణులు, ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు వ్యక్తపరిచినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవిMost Popular