నిఫ్టీ 11,000 పాయింట్లు! 242 స్టాక్స్ అప్ .. !! ఇదే మంచి తరుణమంటున్న ఎనలిస్టులు

నిఫ్టీ 11,000 పాయింట్లు! 242 స్టాక్స్ అప్ .. !! ఇదే మంచి తరుణమంటున్న ఎనలిస్టులు

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తరుణంలో .. దేశీ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 300పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్ల లాభంతో దూసుకెళ్తున్నాయి. బోర్డర్ మార్కెట్లలో అస్థిరత తగ్గుముఖం పట్టి పలు స్టాక్స్ లాభాల బాటలో నడుస్తున్నాయి. ఇన్వెస్టర్లకు ఇది మంచి తరుణమని, స్టాక్స్ ఎంపికకు సరైన సమయం ఇదేనంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో నిఫ్టీ 500 లోని దాదాపు 242 స్టాక్స్ 10-100శాతం వృద్ధిని కనబరుస్తున్నాయి. గత ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకూ ఇండెక్స్ 4.2శాతం పెరిగి 450 పాయింట్ల వరకూ ర్యాలీ చేసింది. ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనుండటంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ అప్రమత్తమయ్యాయి. ఈ రంగాల్లో ఒక పెద్ద బౌన్స్ బ్యాక్ ఉండొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.  నిఫ్టీ 500లో పుంజుకున్న 242 స్టాక్స్ లో సన్ టీవీ, GSPL, మహీంద్ర CIE, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్,  కొచ్చిన్ షిప్ యార్డ్ , బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, జస్ట్ డయల్, వోల్టాస్ , UCO బ్యాంక్, ACC , వేదాంత, టాటా మోటార్ల్ వంటి కంపెనీలు ఉన్నాయి. 
image (4)
గత సంవత్సరం పూర్తిగా నిరాశ పరిచిన మిడ్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు ఆశావహ స్థితిలో నిలిచాయి. పలు కరెక్షన్లకు గరైన మిడ్ క్యాప్ రంగం ఇప్పుడు లాభాల ఆర్జనకు సిద్ధమైనట్టు కనబడుతుంది. అందుబాటు ధరల్లో రానున్న సంవత్సర కాలానికి గానూ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోడానికి మంచి సమయమిదేనని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ కంటే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ మంచి పురోగతిని కనబరచవచ్చని వారి అంచనా. 
image (5)
బ్యాంకింగ్ సెక్టార్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత సంవత్సరం కొంత నష్టాలను మూటగట్టుకున్నా,, ఇప్పుడు అవి లాభాల బాటలో పయనిస్తుండటం గమనార్హం. PSU బ్యాంకుల స్టాక్స్ కూడా రానున్న కొద్ది రోజుల్లో మరింత లాభాలను కనబరుస్తాయని రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ అంచనా వేస్తోంది. 2016-2017 సంవత్సరాల్లో మిడ్ క్యాప్ రంగం అవుట్ పెర్ఫార్మెన్స్‌తో దూసుకెళ్లింది. 2018 చివరినాటికి  పూర్తిగా నెమ్మదించి తన రేటింగ్స్ ను లార్జ్ క్యాప్ స్టాక్స్‌కు అప్పగించేసింది. కానీ.. ఇప్పటి పరిస్థితులు మిడ్ క్యాప్ రంగం తిరిగి వేగంగా పుంజుకోడానికి అనువుగా ఉందని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ పేర్కొంది. అండర్ పెర్ఫార్మెన్స్ నుండి అవుట్ పెర్ఫార్మెన్స్ కు రావడానికి మిడ్ క్యాప్ రంగానికి ఎంతో సమయం పట్టదని, బాటం అప్ అవకాశాలు మిడ్ క్యాప్ రంగంలో ఆసక్తికరంగా ఉన్నాయని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రానున్న కొద్ది నెలల్లో , సార్వత్రిక ఎన్నికల అనంతరం స్మాల్, మిడ్ క్యాప్ రంగాలు పూర్తిగా లాభాల బాటలో పయనిస్తాయని వారు భావిస్తున్నారు. 

Disclaimer: పైన పేర్కొన్న సూచనలు, అభిప్రాయాలు నిపుణులు, ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు వ్యక్తపరిచినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. Most Popular