యూనికెమ్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ పుష్‌

యూనికెమ్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ పుష్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తనిఖీలు చేపట్టిన అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఎలాంటి లోపాలనూ గుర్తించకపోవడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ యూనికెమ్‌ లేబొరేటరీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడతంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 2.6 శాతం పెరిగి రూ. 203 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 5-8 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు యూనికెమ్‌ లేబ్‌ తాజాగా పేర్కొంది. అయితే లోపాలు గుర్తించకపోవడంతో ఫామ్‌ 483 జారీ చేయకుండా తనిఖీలు పూర్తిచేసినట్లు వెల్లడించింది. ఫార్ములేషన్ల తయారీకి వినియోగిస్తున్న ఈ  ప్లాంటును 1969లో ఏర్పాటు చేసిన కంపెనీ 2003కల్లా ఆధునీకరించింది. Most Popular