దిలీప్‌ బిల్డ్‌కాన్‌- ఒకటే స్పీడ్‌

దిలీప్‌ బిల్డ్‌కాన్‌- ఒకటే స్పీడ్‌

ఇటీవల జోరందుకున్న మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 600 వద్ద ట్రేడవుతోంది. ఇందుకు తాజాగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నుంచి లభించిన కాంట్రాక్టు దోహదం చేస్తోంది. ప్రధానంగా రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టిపెట్టే  కంపెనీలో ప్రమోటర్లకు 75.63% వాటా ఉంది.  ఇతర వివరాలు ఇలా...

రూ. 480 కోట్ల ఆర్డర్
మహారాష్ట్రలో నాలుగు లైన్ల జాతీయ రహదారి అభివృద్ధికి NHAI నుంచి దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కాంట్రాక్టును గెలుచుకుంది. ఈపీసీ పద్ధతిలో లభించిన ఆర్డర్‌ విలువ రూ. 480 కోట్లుకాగా.. రెండేళ్లలో పూర్తిచేయవలసి ఉంది. కాంట్రాక్టులో భాగంగా NH-547Eలో 4.7 నుంచి 33.57 కిలోమీటర్లవరకూ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల NHAI నుంచి కాంట్రాక్టులు దక్కించుకుంటున్న నేపథ్యలో షేరు ర్యాలీ బాటలో సాగుతున్న విషయం విదితమే. ఫలితంగా బీఎస్‌ఈలో గత నెల(ఫిబ్రవరి) 5న నమోదైన కనిష్టం రూ. 312 నుంచి దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేరు 92 శాతం దూసుకెళ్లింది.   



Most Popular