స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో దూసుకెళ్ళిన 150 స్టాక్స్! 10-40 శాతం అప్

స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో దూసుకెళ్ళిన 150 స్టాక్స్! 10-40 శాతం అప్

 2018 సంవత్సరం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రంగాలు నష్టాలనే మిగిల్చాయి. 2019 ఆరంభం కూడా ఎమంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. కానీ..అనూహ్యంగా గత వారం మార్కెట్లలో నిఫ్టీ 11,000 పాయింట్లు దాటడం, వరుసగా నాలుగు రోజులు మార్కెట్లు లాభాల బాట పట్టడం మదుపర్లకు కాస్తంత ఆశావహ పరిస్థితులు కనబడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోని దాదాపు 150 స్టాక్స్ 10 నుండి 40శాతం వరకూ పెరిగాయి. 2018 సెప్టెంబర్ 21 న నిఫ్టీ 11,143 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఆ తరువాత మొట్ట మొదటి సారిగా మళ్ళీ గత వారం నిఫ్టీ 11,000 పాయింట్లు దాటింది. S&P BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత నాలుగు రోజుల్లో 4శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ స్టాక్స్ అయిన 154 స్టాక్స్ 10-40శాతం వరకూ ర్యాలీ చేశాయి. దీంతో ప్రముఖ రేటింగ్ ఎజెన్సీలు ఆయా స్టాక్స్ మీద  తిరిగి రేటింగ్స్ ను సవరించాల్సిన పని పడింది. 
V-మార్ట్ , ఆస్ట్రాల్ పోలీ, వినతీ ఆర్గానిక్స్, సాగర్ సిమెంట్‌, JK సిమెంట్స్, అవంతీ ఫీడ్స్, బిర్లా కార్ప్ , ఆర్తీ డ్రగ్స్, రెప్‌కో హోమ్ ఫిన్, వక్రంజీ, క్వాలిటీ, ట్రీ హౌజ్ ఎడ్యుకేషన్ వంటి స్టాక్స్ అత్యధికంగా ర్యాలీ చేశాయి. రానున్న ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు వేగంగా పుంజుకుంటాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. 

5
ఇండో పాక్ యుధ్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ..మార్కెట్ స్థిరత్వం చూపింది. ఫిబ్రవరి నెలలో కొంత అస్థిరత్వం కనబడ్డప్పటికీ.. మార్కెట్లు వెను వెంటనే కోలుకున్నాయి. BSE సెన్సెక్స్ 36,000 పాయింట్లను , నిఫ్టీ 10,900 పాయింట్లను కాపాడుకుందని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొన్నారు. బెంచ్ మార్క్ సూచీలు రానున్న మరి కొద్ది వారాల్లో తిరిగి పుంజుకుంటాయని, స్మాల్ క్యాప్,మిడ్ క్యాప్ స్టాక్స్ మీద రేటింగ్స్ ను సవరించాల్సి వస్తుందని షేర్ ఖాన్ బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. స్మాల్ క్యాప్ రంగంలోని చాలా స్టాక్స్ అవుట్ పెర్ఫార్మింగ్ కనబరుస్తున్న నేపథ్యంలో  తిరిగి రేటింగ్స్ ను సవరించాల్సిందేనని  కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల తరువాత నిఫ్టీ తన టెస్ట్ లెవల్స్ అయిన 11,350-11,550 పాయింట్ల వరకూ టచ్ చేయొచ్చని బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుత నేపథ్యంలో స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాల్లోని స్టాక్స్ ఎంపికకు ఇది మంచి తరుణమని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
 Most Popular