చిన్న షేర్లు... భలే..!

చిన్న షేర్లు... భలే..!

వరుసగా రెండో వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే మార్కెట్లను మించుతూ మధ్య, చిన్న తరహా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు గత వారం చివరికి ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,000 పాయింట్ల మైలురాయి ఎగువన స్థిరపడటం విశేషం! మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం(4) మార్కెట్లకు సెలవుకావడంతో గత వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. అయినప్పటికీ సెన్సెక్స్‌ 608 పాయింట్లు(1.7 శాతం) ఎగసి 36,671 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 172 పాయింట్లు(1.6 శాతం) పురోగమించి 11,035 వద్ద స్థిరపడింది. 

చిన్న షేర్లు జోరు
అందుబాటు ధరలకు చేరిన పలు చిన్న షేర్లలో పెట్టుబడులకు గత వారం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 301 పాయింట్లు(2 శాతం) పెరిగి 14,804 వద్ద ముగిసింది. ఇక స్మాల్‌ క్యాప్‌ మరింత అధికంగా 547 పాయింట్లు(4 శాతం) జంప్‌చేసి 14,529 వద్ద నిలిచింది.

ఐటీ దిగ్గజాల వెనకడుగు
నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పీసీఎల్‌, ఏసీసీ, బీపీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ, ఐబీ హౌసింగ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్‌, ఎంఅండ్‌ఎం, టైటన్‌, బజాజ్‌ ఆటో 7.5-3 శాతం మధ్య ఎగశాయి. అయితే విప్రో, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా 4.6-2.5 శాతం మధ్య క్షీణించాయి. 
 
స్మాల్‌ క్యాప్స్‌ జూమ్‌
గత వారం పలు మధ్య, చిన్నతరహా కౌంటర్లు భారీగా లాభపడ్డాయి. జాబితాలో మన్‌పసంద్‌, రెప్కో హోమ్‌, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్‌, దిలీప్‌ బిల్డ్‌, సుజ్లాన్‌, వక్రంగీ, కేఎన్‌ఆర్, అవంతీ, జేఅండ్‌కే బ్యాంక్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, సన్‌టెక్‌ రియల్టీ, ఎడిల్‌వీజ్‌, లెమన్‌ట్రీ, టైమ్‌ టెక్నో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జైకార్ప్‌, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, నవకార్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, రెయిన్‌ తదితరాలు 30-14 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క ఆర్‌కామ్‌, మ్యాక్స్‌ ఇండియా, డిష్‌ టీవీ, ఎండ్యూరెన్స్‌, పీఅండ్‌జీ, ఎంఫసిస్‌, సనోఫీ, మహానగర్‌ గ్యాస్‌, పీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లైఫ్‌ తదితరాలు 12-4 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular