ఫిబ్రవరిలో తగ్గిన వాహన విక్రయాలు! ఫైనాన్స్ ఇబ్బందులు, అధిక వడ్డీ రేట్లే కారణం!!

ఫిబ్రవరిలో తగ్గిన వాహన విక్రయాలు! ఫైనాన్స్ ఇబ్బందులు, అధిక వడ్డీ రేట్లే కారణం!!

ఈ 2019 ఫిబ్రవరిలో దేశీయ మోటార్ రంగం నిరాశాజనక ఫలితాలనే చవిచూసింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఫిబ్రవరిలో మందగించాయి. ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇవ్వలేక పోవడం, అధిక వడ్డీ రేట్లు వంటి కారణాలతో  కస్టమర్లు వెనకంజ వేశారని  సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మోబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) పేర్కొంది. డొమెస్టిక్ మార్కెట్లో సేల్స్ పడిపోయాయని, గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే.. దాదాపు 1.11శాతం తగ్గి 2,72,284 యూనిట్ల విక్రయాలే జరిగినట్టు SIAM తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్ విక్రయాలు గత సంవత్సరం 2018 ఫిబ్రవరిలో 2,75,346 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

Image result for tata motors cars

ప్యాసింజర్ కార్ల విషయంలో గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఫిబ్రవరిలో 4.33శాతం తగ్గుదలతో 1,71,372 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే.. యుటిలిటీ వెహికిల్స్ విషయంలో కొంత మెరుగైన ఫలితాలే కనబడ్డాయి. యుటిలిటీ వెహికిల్స్ విక్రయాలు 3.57శాతం పెరిగి 83,245 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.  2018 తో పోలిస్తే.. వ్యాన్ల అమ్మకాలు 10.74శాతం పెరిగి 17,667 యూనిట్లు అమ్ముడు బోయాయి. కమర్షియల్ వెహికిల్స్  సెగ్మెంట్‌లో డొమెస్టిక్ సేల్స్ 0.43శాతం స్లిప్‌ అయ్యాయని SIAM పేర్కొంది. 

Image result for new cars
NBFC రంగంలో నగదు కొరత, బ్యాంకుల అధిక వడ్డీ రేట్ల వంటి కారణాలతో కస్టమర్లకు రుణ సదుపాయం ఈ 2019లో క్లిష్టతరమైందని, అందుకే ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని మోటార్ వెహికిల్స్ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఈ శుక్రవారం నాటి మార్కెట్ ముగింపు నాటికి టాటా మోటార్స్ స్టాక్స్ -3.99శాతం తగ్గి రూ. 181.65 వద్ద ట్రేడ్ అయ్యాయి. అలాగే.. మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ -0.82శాతం తగ్గి రూ. 6972.85 వద్ద ముగిసింది. ఇక మహీంద్ర&మహీంద్ర మోటార్స్ -0.13శాతం తగ్గి రూ. 669 వద్ద ట్రేడ్ అయ్యింది.  ఈ ఆర్ధక సంవత్సరం ముగింపు తరువాత రానున్న కొత్త ఆర్ధిక సంవత్సరంలో ఎన్నికల తరువాత మళ్ళీ వాహన రంగం పుంజుకుంటుందని SIAM అంచనా వేస్తోంది. 
Image result for new carsMost Popular