భారీ ట్రేడింగ్‌- షేర్లు- రేసు గుర్రాలు 

భారీ ట్రేడింగ్‌- షేర్లు- రేసు గుర్రాలు 

ప్రపంచవ్యాప్తంగా బలహీనపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. అయితే కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా పెరిగింది. జాబితాలో ఆటో విడిభాగాల సంస్థ ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం...

ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌: వాహనాలలో వినియోగించే విభిన్న పిస్లన్లు, రింగ్స్‌ తయారీ సంస్థ ఫెడరల్‌ మొగల్‌ గోయట్జ్‌ కౌంటర్‌లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఏకంగా 50 రెట్లు ఎగసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 537కు చేరింది. ఇంట్రాడేలో రూ. 572 వరకూ దూసుకెళ్లింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం!

డిక్సన్‌ టెక్నాలజీస్‌: కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, హోమ్‌ అప్లయెన్సెస్‌, లైటింగ్‌ తదితర ప్రొడక్టుల కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సంస్థ డిక్సన్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 7 రెట్లు ఎగసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం పెరిగి రూ. 2450కు చేరింది. ఇంట్రాడేలో రూ. 2548 వరకూ దూసుకెళ్లింది.

రిలయన్స్‌ నిప్పన్ లైఫ్‌: అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ రిలయన్స్‌ నిప్పన్ లైఫ్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 11 రెట్లు ఎగసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 203కు చేరింది. ఇంట్రాడేలో రూ. 223 వరకూ దూసుకెళ్లింది.Most Popular