ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్‌ హెచ్ 1 బి వీసాలను టార్గెట్ చేసిన అమెరికా

ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్‌ హెచ్ 1 బి వీసాలను టార్గెట్ చేసిన అమెరికా

ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్‌ హెచ్ 1 బి వీసాలను టార్గెట్ చేసిన అమెరికా

హెచ్ 1 బి వీసాలు 2018లో భారీ ఎత్తున రిజెక్ట్ అయ్యాయి. ట్రంప్ సర్కార్ వీసాలపై కఠినంగా ఉన్న నేపధ్యంలో గతేడాది ఎప్పుడూ లేనంతగా వీసాలను రద్దు చేసింది. వీటిల్లో ప్రధానంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ సంస్థలకు అధిక ప్రభావం ఉంది. 

దేశవ్యాప్తంగా అనేక ఐటీ సంస్థలు హెచ్ 1 బి వీసాల సహకారంతో అమెరికాలో పనిచేసేందుకు తమ ఉద్యోగులను పంపిస్తూ ఉంటాయి. అయితే తమ దేశ పౌరులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి అక్కడ ఈ స్కిల్ సెట్ దొరకకపోతేనే విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకోవాలనే రూల్ ఎప్పటినుంచో ఉంది. అయితే భారతీయ ఐటి కంపెనీలు ఎక్కువగా ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. ఇది ఆ దేశ పౌరుల ఉద్యోగులకు ఎసరుపెట్టడంతో డోనాల్డ్ ట్రంప్ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇది మన ఐటీ కంపెనీలనూ, డాలర్ డ్రీమ్స్ కంటున్న యువతపై ప్రభావాన్ని చూపిస్తోంది. 

2018 వీసాల మంజూరు - రద్దు లెక్కలు చూస్తే.. ఇన్ఫోసిస్ అత్యధికంగా ఇబ్బంది పడింది. 2042 మంది హెచ్ 1 బి వీసాలను యూఎస్ రిజెక్ట్ చేసింది. తర్వాత టీసీఎస్‌కు చెందిన 1744 వీసాలు రిజెక్ట్ అయ్యాయి. ఇదే బాటలో కాగ్నిజెంట్‌కు చెందిన 3548 వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ లెక్కలను సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ ప్రచురించింది. 

ఇన్ఫోసిస్, టిసిఎస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్ సి ఎల్ టెక్ కంపెనీలకు చెందిన వీసాల్లో 2/3 వంతు రద్దు కావడం ప్రధాన చర్చగా మారింది. టాప్ కంపెనీల హెచ్ 1 బీలే రద్దైతే ఇక చిన్నవాటి గురించి ఆలోచించాల్సిన పనేలేదనే మాట వినిపిస్తోంది. భారత దేశానికి చెందిన మొత్తం 30 ఐటీ కంపెనీల 13,177 హెచ్ 1 బీలను అమెరికా తిరస్కరించింది. వీటిల్లో కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌వి మాత్రమే 7933 వీసాలు ఉన్నాయి. Most Popular