అలహాబాద్‌ బ్యాంక్‌ అప్‌- జూబిలెంట్‌ డౌన్‌

అలహాబాద్‌ బ్యాంక్‌ అప్‌- జూబిలెంట్‌ డౌన్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ దిద్దుబాటు చర్యల జాబితా(పీసీఏ) నుంచి బయటపడేశాక జోరందుకున్న పీఎస్‌యూ సంస్థ అలహాబాద్‌ బ్యాంక్‌ కౌంటర్ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోవైపు యూఎస్ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేసిన వార్తలతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. వివరాలు చూద్దాం...

అలహాబాద్‌ బ్యాంక్‌
గత మూడు వారాలుగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ షేరు మళ్లీ వెలుగులో నిలుస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 6896 కోట్లమేర పెట్టుబడులను సమకూర్చడం దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిధుల్లో కొంతమేర మొండిబకాయిల మెరుగుకు వినియోగించనుండటం దీనికి కారణంకాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అలహాబాద్‌ బ్యాంక్‌ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 57 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 58ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాగా.. గత నెల రోజుల్లోనే ఈ కౌంటర్‌ 41 శాతం దూసుకెళ్లడం విశేషం!

Related image

జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికలను(OAI) జారీ చేయడంతో జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కౌంటర్ బలహీనపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 765 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 745 వరకూ పతనమైంది. సోలిడ్‌ డోసేజీ ఫార్ములేషన్ల రూర్కీ ప్లాంటులో 2018 ఆగస్ట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించింది. కాగా.. కంపెనీలో అమ్మకాలలో రూర్కీ ప్లాంటు వాటా 4 శాతంగా నిపుణులు పేర్కొంటున్నారు.Most Popular