ఈక్లర్క్స్‌ బైబ్యాక్‌- గ్రాన్యూల్స్‌ జూమ్‌

ఈక్లర్క్స్‌ బైబ్యాక్‌- గ్రాన్యూల్స్‌ జూమ్‌

సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదన ప్రకటించడంతో తాజాగా ఐటీ ఔట్‌సోర్సింగ్‌ సేవల దిగ్గజం ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా మరోపక్క ప్రమోటర్లు షేర్ల తనఖా భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేపట్టడంతో ఫార్మా రంగ హైదరాబాద్‌ సంస్థ గ్రాన్యూల్స్‌ ఇండియా కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం...

ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ 
ఇటీవల కొంతకాలంగా నేలచూపులకే పరిమితమై కదులుతున్న షేరుకి జోష్‌నిచ్చే బాటలో నాలెడ్జ్‌, బిజినెస్‌ ప్రాసెస్‌, అనలిటిక్స్‌ తదితర ఐటీ కన్సల్టింగ్‌ సేవలు అందించే ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ యాజమాన్యం ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసింది. బైబ్యాక్‌ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 14న(గురువారం) సమావేశంకానున్నట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈక్లర్క్స్‌ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 1094 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1110 వరకూ ఎగసింది. కాగా.. గత 10 నెలల్లో ఈ షేరు 23 శాతం తిరోగమించడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Image result for granules india ltd

గ్రాన్యూల్స్‌ ఇండియా
రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రమోటర్లు బ్లాక్‌డీల్స్‌ ద్వారా స్వల్ప వాటాను విక్రయించినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 7.6 శాతం జంప్‌చేసి రూ. 112 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 114 వరకూ ఎగసింది. గ్రాన్యూల్స్‌ ఇండియా ఈక్విటీలో 0.2 శాతం వాటాకు సమానమైన 5 మిలియన్‌ షేర్లను ప్రమోటర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. తద్వారా రూ. 50 కోట్లు సమీకరించినట్లు తెలుస్తోంది. దీనికితోడు వ్యక్తిగత ఆస్తుల విక్రయం ద్వారా మరో రూ. 50 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నిధులతో ప్రమోటర్ల తనఖా వాటాను 54 శాతం నుంచి 30 శాతానికి తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది.Most Popular