అడ్వాన్స్‌డ్‌ లాభాల ఎంజైమ్‌- విప్రో వీక్‌ 

అడ్వాన్స్‌డ్‌ లాభాల ఎంజైమ్‌- విప్రో వీక్‌ 

స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో బ్లాక్‌డీల్స్‌ జరిగినట్లు వెల్లడికావడంతో హెల్త్‌కేర్‌ రంగ సంస్థ అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా..  మరోపక్క బ్లాక్‌డీల్స్‌ జరిగినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించిన నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం...

అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో రెండు బ్లాక్‌డీల్స్‌ జరిగినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. తద్వారా కోటి షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే అమ్మకందారులు, కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. దీంతో ట్రేడింగ్‌ పరిమాణం సైతం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 250 రెట్లు అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 184 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 195 వరకూ ఎగసింది. ఇది 20 శాతం అధికంకాగా.. 2016 ఆగస్ట్‌ తరువాత షేరు ఈ స్థాయిలో జంప్‌చేయడం ఇదే తొలిసారికావడం గమనార్హం!

Related image

విప్రో లిమిటెడ్‌ 
బీఎస్‌ఈలో బ్లాక్‌డీల్‌ ద్వారా ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ కౌంటర్‌లో 2.67 కోట్ల షేర్లు చేతులు మారినట్లు ఎక్స్ఛేంజీ డేటా వెల్లడించింది. అయితే అమ్మకందారులు, కొనుగోలుదారుల వివరాలు తెలియవలసి ఉంది. దీంతో గత 20 రోజుల సగటుతో పోలిస్తే ట్రేడింగ్‌ పరిమాణం సైతం 70 రెట్లు ఎగసినట్లు తెలుస్తోంది. కాగా.. కంపెనీ ప్రమోటర్‌ గ్రూప్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ ట్రస్ట్‌ బ్లాక్‌డీల్స్‌ ద్వారా 0.29 శాతం వాటాకు సమానమైన 1.78 కోట్ల విప్రో షేర్లను విక్రయించేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో విప్రో లిమిటెడ్‌ షేరు 3.2 శాతం క్షీణించి రూ. 260 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 258 వరకూ నీరసించింది.Most Popular