ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌- కొత్త రికార్డ్‌

ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌- కొత్త రికార్డ్‌

గత కొంత కాలం నుంచీ పటిష్ట పనితీరు, సరికొత్త ప్రొడక్టుల విడుదల కారణంగా ర్యాలీ బాటలో సాగుతున్న ప్లాస్టిక్‌ పైపింగ్‌ ప్రొడక్టుల సంస్థ ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో కన్సాలిడేషన్‌ మార్కెట్లోనూ ఈ షేరు లాభాలతో కళకళలాడుతోంది. తద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం! ఇతర వివరాలు ఇవీ..

ఐదు నెలలుగా..
కారుగేటెడ్‌ తదితర ప్లాస్టిక్‌ పైపింగ్‌ సొల్యూషన్స్‌ అందించే రెక్స్‌ పాలీఎక్స్‌ట్రూజన్‌ సంస్థను విలీనం చేసుకునేందుకు వాటాదారులు తాజాగా అనుమతి తెలియజేయడంతో ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం  ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతంపైగా జంప్‌చేసి రూ. 1202 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1233కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! కాగా.. గత ఐదు నెలల్లో ఈ షేరు 49 శాతం దూసుకెళ్లింది. ఇదే సమయంలో నిఫ్టీ 6 శాతమే బలపడింది. 2018 అక్టోబర్‌ 8న ఆస్ట్రల్‌ పాలీ షేరు రూ. 815 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి టర్న్‌అరౌండ్‌ అయ్యి ర్యాలీ బాటలో సాగుతోంది.

9 నెలల్లో పనితీరు
ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) తొలి తొమ్మిది నెలల్లో ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌-డిసెంబర్‌'2018 కాలంలో కంపెనీ నికర లాభం 24 శాతం ఎగసి రూ. 137 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 21 శాతం పుంజుకుని రూ. 1740 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 14.5 శాతం నుంచి దాదాపు 16 శాతానికి జంప్‌ చేశాయి.

ఇతర కారణాలు..
నిల్వల నిర్వహణను మెరుగుపరుస్తూ ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌ కోయంబత్తూర్‌, బెంగళూరు డిపోలను మూసివేసింది. దీంతో దక్షిణాదిలో ప్రొడక్టుల సరఫరాను హోసూర్‌ నుంచి చేపడుతోంది. మరోవైపు అధెసివ్‌, పైపుల విభాగంలో కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. తద్వారా మార్జిన్లను సైతం పెంచుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌ కౌంటర్ కొంత కాలంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు.Most Popular