పెన్నీ స్టాక్స్‌- స్మాల్‌ క్యాప్స్‌- పరుగో పరుగు!

పెన్నీ స్టాక్స్‌- స్మాల్‌ క్యాప్స్‌- పరుగో పరుగు!

గత నెలలో మార్కెట్ల కరెక్షన్‌లో ఏడాది కనిష్టాలకు చేరిన పలు పెన్నీ స్టాక్స్‌ ఇటీవల కొద్ది రోజులుగా లాభాల దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలను వీడి కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు సైతం టర్న్‌అరౌండ్‌కాగా.. పలు స్టాక్స్‌ రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. వీటిలో పవన విద్యుత్‌ పరికరాల సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ, మౌలిక సదుపాయాల సంస్థ పుంజ్‌ లాయిడ్‌, జియోస్పేటియల్ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ రోల్టా ఇండియా, డైవర్సిఫైడ్‌ సంస్థ జీవీకే పవర్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ సంస్థ తేజాస్‌ నెట్‌వర్క్స్‌ తదితరాలున్నాయి. ఇతర వివరాలు చూద్దాం...

సుజ్లాన్‌ ఎనర్జీ లీడర్‌
గత మూడు వారాల్లో బౌన్స్‌బ్యాక్‌ అయిన పెన్నీ స్టాక్స్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ ముందుంది. ఈ స్టాక్‌ ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 7.80 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 8.40 వరకూ ఎగసింది. ఫిబ్రవరి 18న ఈ షేరు రూ. 3.45 వద్ద ఏడాది కనిష్టానికి చేరింది. అప్పటినుంచీ 115 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ బాటలో పుంజ్‌లాయిడ్‌ రూ. 1.42 నుంచి రూ. 2.5కు పెరిగింది. ఇది 58 శాతంపైగా లాభంకాగా.. రోల్టా ఇండియా రూ. 5 నుంచి పెరిగి రూ. 8ను తాకింది. ఇది 57 శాతం వృద్ధి. ఇదే విధంగా జీవీకే పవర్‌ రూ. 5.30 నుంచి రూ. 8.15కు చేరగా.. తేజాస్‌ నెట్‌వర్క్స్‌ రూ. 120 నుంచి రూ. 187కు ఎగసింది. ఇది 53 శాతం పురోగతి. 

ఇతర కౌంటర్లూ...
ఫిబ్రవరి 18న కనిష్టాలను చవిచూసిన పలు పెన్నీ స్టాక్స్‌సహా స్మాల్‌ క్యాప్స్‌ ప్రస్తుత ధరల(బీఎస్ఈ) ప్రకారం 50-30 శాతం మధ్య ర్యాలీ చేయడం విశేషం. జాబితాలో శివమ్‌ ఆటో, బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, రెలిగేర్‌, ఉత్తమ్‌ షుగర్, జేపీ ఇన్ఫ్రా, ఆషాపురా ఇంటి, ట్రిల్‌, ఉదయ్‌పూర్‌, ఎస్‌ఎంఎల్‌, జేకుమార్‌, పనామా పెట్రో, క్రిధాన్‌ ఇన్ఫ్రా, ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌, ఏటూజెడ్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, ఆషాపురా మైన్‌, ద్వారికేష్‌, జేపీ, సద్భావ్‌ ఇంజి, ఐబీ ఇంటిగ్రేటెడ్‌, రెప్కో హోమ్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రా, మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, సోరిల్‌ ఇన్‌ఫ్రా, ప్రైమ్‌ ఫోకస్‌, హెచ్‌జీ ఇన్ఫ్రా, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, న్యూలాండ్‌ లేబ్‌, జేపీ వెంచర్స్‌, స్టార్‌ పేపర్‌, 3ఐ, తిరుమలై, టేక్‌ సొల్యూషన్స్‌, శాటిన్‌ క్రెడిట్‌, భన్సాలీ, టీపీఎల్‌ ప్లాస్ట్‌, ప్రిజమ్‌ జాన్సన్‌, సీజీ పవర్‌, అవధ్‌ షుగర్‌, రాయల్‌ ఆర్కిడ్‌ 50-30 శాతం మధ్య పురోగమించాయి.

(Source: Business Standard)Most Popular