కేఎన్‌ఆర్-రేటింగ్‌ జోష్‌- ఎన్‌బీసీసీ అప్‌

కేఎన్‌ఆర్-రేటింగ్‌ జోష్‌- ఎన్‌బీసీసీ అప్‌

విదేశీ బ్రోకింగ్ సంస్థ షేరుకి బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో మౌలిక సదుపాయాల సంస్థ కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఫిబ్రవరిలో లభించిన ఆర్డర్ల వివరాలు వెల్లడించడంతో నిర్మాణ రంగ పీఎస్‌యూ సంస్థ ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌
విదేశీ రీసెర్చ సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ తాజాగా బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కేఎన్‌ఆర్‌ 7 శాతం జంప్‌చేసి రూ. 235 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 238 వరకూ ఎగసింది. కంపెనీ చరిత్రలోనే రికార్డ్‌ స్థాయికి చేరిన ఆర్డర్‌బుక్‌ కేఎన్‌ఆర్‌ పనితీరు మెరుగుకు దోహదం చేయనున్నట్లు జేఎం ఫైనాన్షియల్‌ అభిప్రాయపడింది. దీనికితోడు ఇకపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(NHAI) నుంచి మరిన్ని కాంట్రాక్టులు లభించనున్నట్లు అంచనా వేసింది. దీంతో రూ. 255 టార్గెట్‌ ధరతో షేరు కొనుగోలుకి సిఫారసు చేసింది.

Image result for NBCC Ltd

ఎన్‌బీసీసీ లిమిటెడ్‌
ఫిబ్రవరి నెలలో మొత్తం రూ. 804 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించినట్లు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసుల పీఎస్‌యూ సంస్థ ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో జనవరిలోనూ రూ. 356 కోట్ల విలువైన ఆర్డర్లు పొందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎన్‌బీసీసీ ఇండియా షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 60 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 70.57 శాతం వాటా ఉంది. Most Popular