లాభాలతో మార్కెట్‌- చిన్న షేర్లు ఖుషీ

లాభాలతో మార్కెట్‌- చిన్న షేర్లు ఖుషీ

వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్టంగా కదులుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలున్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 11,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 48 పాయింట్లు జమ చేసుకుని 11,035 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్‌ 141 పాయింట్లు ఎగసి 36,584కు చేరింది. మంగళవారం అమెరికా మార్కెట్లు యథాతథంగా నిలవగా.. యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. 

మీడియా, ఆటో వెనకడుగు
ఎన్‌ఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధాన రంగాలన్నీ దాదాపు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. మీడియా, ఆటో స్వల్ప వెనకడుగులో ఉన్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, ఇన్ఫ్రాటెల్‌, వేదాంతా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, హిందాల్కో, ఐవోసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ 3.6-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, యాక్సిస్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, ఇండస్‌ఇండ్, మారుతీ 1.7-0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి.

దివాన్‌ దూకుడు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివాన్‌ హౌసింగ్‌ 13 శాతం దూసుకెళ్లగా, సుజ్లాన్‌, బిర్లా సాఫ్ట్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఇన్ఫీబీమ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, పిరమల్‌, ఎన్‌బీసీసీ, ఐసీఐసీఐ ప్రు, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 8-4.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క భారత్ ఫోర్జ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐఆర్‌బీ, అలహాబాద్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, నెస్లే, ఐజీఎల్‌ 2-1.5 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు భళా
మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లకు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున ఎగశాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఎడిల్‌వీజ్‌, కేఐవోసీఎల్‌, ఎన్‌ఎల్‌సీ, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, టాటా వపర్‌, ఇండియన్‌ బ్యాంక్‌, హడ్కో, ఐఎస్‌ఈసీ, నాల్కో, కమిన్స్‌, బ్లూడార్ట్, వర్ల్‌పూల్‌ తదితరాలు 7.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. స్మాల్‌ క్యాప్స్‌లో జేఅండ్‌కే బ్యాంక్‌, డ్రెడ్జింగ్‌ కార్ప్‌, ఆషాపురా, శ్రీరామ్‌ ఈపీసీ, టైమ్‌ టెక్నో, కేశోరామ్, వివిమెడ్‌, డీబీఎల్‌, మీర్జా, డీబీ కార్ప్‌, డీసీఎం శ్రీరామ్‌, ప్రాజ్‌, ఎవరెడీ, యుఫో తదితరాలు 17-7 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular