నిలకడ లేని స్టాక్..! అయినా.. 116% జంప్..!!

నిలకడ లేని స్టాక్..! అయినా.. 116% జంప్..!!

భారత దేశపు స్టాక్ మార్కెట్లలో అత్యంత అస్థిరమైన స్టాక్‌గా ఈ కంపెనీ షేర్లకు పేరు. అయినా.. ఆశ్చర్యకరంగా BSE 500లోని ఈ స్టాక్ దాదాపు గత 3 సెషన్స్‌లోనే 116శాతం పెరిగింది. దేశంలో అతి పెద్ద విండ్ టర్బైన్ల తయారీ సంస్థ సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్స్ గత సంవత్సరంగా అత్యంత చెత్త ప్రదర్శన చేస్తూ వచ్చింది. కానీ.. గత నెల నుండి ఈ స్టాక్ మిగతా వాటి కంటే..అత్యధిక వేగంతో పుంజుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత 3 వారాల నుండి ఈ స్టాక్ ప్రైస్‌ ఒక్కసారిగా రెట్టింపైంది. గత నెల ఫిబ్రవరిలో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ రికార్డ్ స్థాయిలో అత్యంత కనిష్టానికి పడిపోయింది. ఆ తరువాత సుజ్లాన్‌ ఎనర్జీలో వెస్టాస్ విండ్ సిస్టమ్స్ పెట్టుబడులు పెట్టనుందని వార్తలు రావడంతో ఈ స్టాక్స్ అనూహ్య రీతిలో పుంజుకోడం ప్రారంభించింది. అంతకు ముందు  సుజ్లాన్ తన రుణ దాతలకు చెల్లింపులు చేయలేక డీఫాల్టర్‌గా పేరొందింది. గత సంవత్సరం జులై నుండి కొన్ని బాండ్ల పేమెంట్ చేయలేని దుస్థితిలో సుజ్లాన్ కూరుకు పోయి ఉండటం గమనార్హం. 
The Most Volatile Stock in India Has Already Surged 116%
దేశంలో ఎన్నికలు రానుండటం, సుజ్లాన్‌లో ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయన్న వార్తలు స్ప్రెడ్ కావడం, విండ్ ఎనర్జీ కాంట్రాక్టులు ఎన్నికల తరువాత సుజ్లాన్‌ ఎనర్జీకి వస్తాయన్న స్పెక్యులేషన్స్ వంటి కారణాలతో ఈ స్టాక్స్ ఆకస్మికంగా పుంజుకున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వారం ఆరంభంలో మంగళవారం నాటి మార్కెట్లలో కూడా సుజ్లాన్ దాదాపు 23శాతం పెరిగింది. గత 6ఏళ్ళుగా రుణ దాతలకు చెల్లింపుల కోసం ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ వస్తున్న సుజ్లాన్ ఎనర్జీ మళ్ళీ తిరిగి పుంజుకోడం శుభ పరిణామమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం గనుక ఏర్పడితే.. తిరిగి సుజ్లాన్ వంటి అస్థిర స్టాక్స్ పుంజుకుంటాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. నేటి బుధవారం నాటి మార్కెట్లలో సుజ్లాన్ ఎనర్జీ షేర్ రూ. 6.45శాతం పెరిగి రూ. 7.92 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 8.40 ను తాకిన సుజ్లాన్ రానున్న రోజుల్లో ఎలాంటి పనితీరును ప్రదర్శించబోతుందో వేచి చూడాలి. 
 Most Popular