ఎడిల్‌వీజ్‌- క్విక్‌ హీల్‌- క్విక్‌ గెయిన్స్‌

ఎడిల్‌వీజ్‌- క్విక్‌ హీల్‌- క్విక్‌ గెయిన్స్‌

అనుబంధ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలో ఉత్తర అమెరికా ఫండ్‌ మేనేజర్‌ సంస్థ సీడీపీక్యూ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించడంతో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు కౌంటర్‌కు హుషారొచ్చింది. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు అనుమతి లభించిన వార్తలతో క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కూ డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌
అనుబంధ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ఈసీఎల్‌ ఫైనాన్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సీడీపీక్యూ పీఈ ఏషియా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తాజాగా పేర్కొంది. తద్వారా  సీడీపీక్యూ రూ. 1800 కోట్లు(25 కోట్ల డాలర్లు)ను ఈసీఎల్‌ ఫైనాన్స్‌లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో క్రెడిట్‌ బిజినెస్‌ను మరింతగా విస్తరించే వీలు కలగనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ షేరు 7.5 శాతం జంప్‌చేసింది. రూ. 165 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 172ను సైతం అధిగమించింది.

Image result for quick heal technologies

క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 9 శాతం ఈక్విటీ వాటాకు సమానమైన 63.63 లక్షలకుపైగా షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఒక్కో షేరు రూ. 275 ధర మించకుండా బైబ్యాక్‌ చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 175 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రమోటర్లు సైతం బైబ్యాక్‌లో భాగంగా 46 లక్షలకుపైగా షేర్లను విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ షేరు 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 234 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 240 వరకూ ఎగసింది.