స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... (మార్చి 6)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌... (మార్చి 6)
  • ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌లో మొత్తం 7.50శాతం వాటాను విక్రయించనున్నట్టు ప్రకటించిన కంపెనీ ప్రమోటర్లు
  • బ్లూస్టార్ కొత్త ఎండీగా బి.త్యాగరాజన్‌, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
  • స్విఫ్ట్‌కు సంబంధించిన కార్యకలాపాలను నియంత్రించడంలో విఫలమైన బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
  • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు రూ.2 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ
  • బీఓబీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌లకు రూ.10 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ
  • రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ల షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ప్రోగ్రామ్‌ రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్‌ చేసిన ఇక్రా
  • రూ.175 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనున్న క్విక్‌హీల్‌ టెక్నాలజీస్‌
  • డివిడెండ్‌ను ప్రకటించే యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంతా
  • కన్వర్టబుల్‌ బాండ్లు లేదా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులను సమీకరించాలని యోచిస్తోన్న ఏషియన్‌ గ్రానిటో
  • రూ.50 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్‌ను విడుదల చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌


Most Popular