సెన్సెక్స్‌ ట్రిపుల్‌ -వహ్వా -చిన్న షేర్లు

సెన్సెక్స్‌ ట్రిపుల్‌ -వహ్వా -చిన్న షేర్లు

ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 303 పాయింట్లు జంప్‌చేసి 36,367కు చేరింది. నిఫ్టీ సైతం సెంచరీ సాధించింది. 107 పాయింట్లు పెరిగి 10,970 వద్ద ట్రేడవుతోంది. సోమవారం యూఎస్‌ మార్కెట్లు నీరసించగా.. ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. ఇక ప్రస్తుతం యూరోపియన్‌ మార్కెట్లు సైతం అటూఇటుగా ప్రారంభమయ్యాయి. కాగా.. నేటి ట్రేడింగ్‌లో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు మార్కెట్లను మించుతూ జోరు చూపడం విశేషం!
 
ఆటో, మెటల్‌, బ్యాంక్స్‌ జోరు
ఎన్‌ఎస్ఈలో ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ 3-2 శాతం మధ్య జంప్‌చేయగా.. ఐటీ 1 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 8 శాతం దూసుకెళ్లగా.. ఐషర్‌, ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, యాక్సిస్‌, హీరో మోటో, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ 7-3 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, జీ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా 3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

సుజ్లాన్‌ దూకుడు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో సుజ్లాన్‌ 22 శాతం దూసుకెళ్లగా, రెప్కో హోమ్‌, జేపీ, ఎన్‌సీసీ, పీసీ జ్యువెలర్స్‌, ఇన్ఫీబీమ్‌, ఎంసీఎక్స్‌, పీఎన్‌బీ, ఉజ్జీవన్‌ 11-8 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా, మరోపక్క మహానగర్ గ్యాస్‌, మైండ్‌ట్రీ, డిష్‌ టీవీ, నిట్‌ టెక్‌, టొరంట్‌ ఫార్మా, బయోకాన్‌ 2.4-1 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు భళా
మార్కెట్లు పటిష్ట లాభాలతో కదులుతున్న నేపథ్యంలో చిన్న షేర్లకు మరింత డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్ 2 శాతం, స్మాల్‌ క్యాప్‌ 3 శాతం చొప్పున ఎగశాయి. స్మాల్‌ క్యాప్స్‌లో బీజీఆర్, హెచ్‌జీ ఇన్ఫ్రా, క్రిధాన్‌, ఆషాపురా, జేఎస్‌ఎల్‌, చమన్‌లాల్‌, కేసర్‌, రెలిగేర్‌, కిరీ, బీఈపీఎల్‌, ఐఎంఎఫ్‌ఏ, శివమ్‌ ఆటో, వెలెంట్‌, ఎన్‌ఎల్‌ఎసీ, స్వెలెక్ట్‌, సర్లా పాలీ, గణేశ్ తదితరాలు 20-12 శాతం మధ్య దూసుకెళ్లాయి.Most Popular