ప్యాసింజర్లకు ఇండిగో బంపర్ హోలీ ఆఫర్..! రూ.899 నుండి టిక్కెట్ ధరలు

ప్యాసింజర్లకు ఇండిగో బంపర్ హోలీ ఆఫర్..! రూ.899 నుండి టిక్కెట్ ధరలు

దేశీయ విమాన యాన దిగ్గజం, ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగ దారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరలకే విమానయానం కింద, స్పెషల్ హోలీ సేల్ పేరిట మార్చ్ 19 నుండి సెప్టెంబర్ 28 వరకూ మధ్య కాలంలో ప్రయాణించే వారికి టిక్కెట్ ధరల్లో భారీ డిస్కౌంట్లు , రాయితీలు ప్రకటించింది. దేశీయ రూట్లలోనూ, విదేశీ రూట్లలోనూ ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. 
ఈ హోలీ స్పెషల్ స్కీం కింద మార్చ్ 5 నుండి మార్చ్ 7 వరకు మధ్య కాలంలో  టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి దేశీయ రూట్లలో కేవలం రూ. 899 నుండి , విదేశీ రూట్లలో రూ. 3,399 నుండి టిక్కెట్ ధరలు ప్రారంభమౌతాయని ఇండిగో ఎయిర్ లైన్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ పేర్కొన్నారు.   మార్చ్‌ 19 నుండి, సెప్టెంబర్ 28 మధ్య కాలంలో ప్రయాణించే వారికి, మార్చ్ 5,6,7 తేదీల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటేనే ఈ పథకం వర్తిస్తుందని ఇండిగో తెలిపింది. దేశీయ విమాన యాన రంగంలో దాదాపు 40శాతం వాటాను కలిగిఉన్న ఇండిగో ఎయిర్ లైన్స్ ప్లేన్స్ ఆక్యుపెన్సీ పెంచడం, మరింత మంది కొత్త విమాన ప్రయాణీకులను పెంచుకోడంలో భాగంగానే ఈ హోలీ ఆఫర్ ప్రకటించామని తెలిపింది. 

 Most Popular