22 కంపెనీల EPS డౌన్.. ! మరి మీ వద్ద ఉన్న వాటి పరిస్థితి ఏంటి?

 22 కంపెనీల EPS డౌన్.. ! మరి మీ వద్ద ఉన్న వాటి పరిస్థితి ఏంటి?

గత డిసెంబర్ క్వార్టర్ ఫలితాలలో చాలా కంపెనీలు బ్రోకరేజ్ అంచనాలకు సమానంగా రాణించాయి. కంపెనీలు  ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ గ్రోత్ విషయంలో మంచి పనితీరునే కనబరిచాయి. క్రెడిట్ లభ్యత పెరగడం, క్రెడిట్ కాస్ట్ పెరుగుదల వంటి అంశాల కారణంగా Q-3 ఫలితాలు చాలా వరకూ ఆశాజనకంగానే ఉన్నాయి. ఆటో రంగం మాత్రం కొంత అమ్మకాల ఒత్తిళ్ళు, హై ఇన్‌పుట్ వ్యయాలు, నిర్వాహణ సామర్ధ్య వైఫల్యాలు, డిస్కౌంట్లు, అమ్మకాల తగ్గుదల వంటి కారణాలతో నిరాశజనక ఫలితాలను వెల్లడించాయి. టాటా మోటార్స్ వంటి కంపెనీల మార్జిన్లు పై కారణాలు పెను ప్రభావాన్నే చూపాయి. 
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ (PAT) గ్రోత్ విషయంలో నిఫ్టీ 50 లోని కంపెనీలు SBI, ONGC, HDFC బ్యాంక్‌లు ఈ డిసెంబర్ క్వార్టర్‌లో అగ్రగాములుగా రాణించాయి. ఇదే సమయంలో IOC, HDFC సెక్యూరిటీస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు గ్రోత్ విషయంలో వెనకంజ వేశాయని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఎలారా క్యాపిటల్ పేర్కొంది. 
ఎలారా చేసిన సర్వే ప్రకారం 2020 ఆర్ధిక సంవత్సరానికి గానూ లాభార్జనలో నిలకడైన వృద్ధిని కనబరుస్తున్న కంపెనీల్లో హావెల్స్ ఇండియా, DLF, నెస్ట్లీ ఇండియా, టెక్ మాహీంద్ర, HCL టెక్నాలజీస్, విప్రో, Dr. రెడ్డీస్ ల్యాబ్స్ వంటివి ఉన్నాయి. ఎలారా క్యాపిటల్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 22 కంపెనీలు FY20 కి గాను ఎర్నింగ్స్ లో వెనకబడి ఉన్నాయి(గత 4 త్రైమాసికాలను పరిగణనలోకి తీసుకుంటే) . వీటిలో సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, మారుతీ సుజుకీ, MRF, PNB, టాటా మోటార్స్ , వేదాంతా లు ఉన్నాయి. 
కంపెనీల గత 4 క్వార్టర్ ఫలితాలను బట్టీ ఎలారా క్యాపిటల్ 2019 ఆర్ధిక సంవత్సరానికి గానూ నిఫ్టీ 50 EPS ను 501 పాయింట్లకు కుదించింది. (-5.9శాతం), 2020 ఆర్ధిక సంవత్సరానికి గానూ... 626 పాయింట్లు (4.9శాతం డౌన్) కు తగ్గించింది. సాధారణంగా భారత్‌ వంటి దేశాల్లో డొమెస్టిక్ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు వృద్ధి రేటును బట్టే పెట్టుబడులు పెడుతుంటారు. కంపెనీల గ్రోత్‌ను చూసి తమ పెట్టుబడులను పెంచుతుంటారు. స్టాక్‌ ధరల విషయంలో ఆదాయం పెరుగుదల, ROE, P/E వంటి అంశాలను చూస్తారు. గుణాత్మక లాభాల కోసం కంపెనీ వృద్ధిరేటును తరుచూ పరిశీలించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. ఇక్కడ కొన్ని సార్లు కంపెనీల స్ట్రక్చరల్ డౌన్‌గ్రేడ్ ను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది ఫార్మా కంపెనీల్లో కనబడుతుంది. తక్కువ వ్యయం విషయంలో గ్లోబల్ కొనుగోలుదారులు పోటీ పడుతున్నందున, భారతీయ జనరిక్ ఫార్మా కంపెనీలు లాభాలను మెయిన్‌టెన్ చేయడానికి సతమతమౌతున్నాయి. లుపిన్, సన్ ఫార్మా, సిప్లా, క్యాడిలా హెల్త్ కేర్  వంటి కంపెనీలు ఈ స్ట్రక్చరల్ డౌన్‌గ్రేడ్‌తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. RoE ఎర్నింగ్స్ లో ఈ కంపెనీలు క్షీణతను చవిచూస్తున్నాయి. 
కంపెనీల ఆదాయాల్లో ఉత్థాన పతనాలను ఒక కొలమానంగా స్టాక్స్ ఎంపిక సమయంలో చూడాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. కంపెనీ ఆదాయాల్లో క్షీణత కనబడతున్నప్పుడు ఆయా కంపెనీలపై అత్యుత్సాహం చూపవద్దని మదుపర్లకు వారు సూచిస్తున్నారు. ఒక స్టాక్‌ EPS ఎప్పుడైతే.. పెరుగుతుందో అప్పుడు ఆస్టాక్స్ ఎంపికకు అది సరైన సమయం అని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. EPS అప్‌గ్రేడ్, డౌన్ గ్రేడ్ వంటి అంశాలను కూడా మదుపర్లు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుందని అప్పుడే మన పోర్ట్ ఫోలియోల్లోని స్టాక్స్ లాభాలను ఆర్జిస్తాయని ఎలరా క్యాపిటల్ పేర్కొంది. 

 Most Popular