GST రాబడుల తగ్గుదల..! టార్గెట్లను సవరించిన ప్రభుత్వం..!

GST రాబడుల తగ్గుదల..! టార్గెట్లను సవరించిన ప్రభుత్వం..!

గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (GST) వసూళ్ళు ఈ 2019 ఫిబ్రవరిలో అంచనాల మేరకు వసూలు కాలేక పోయాయి. జనవరిలో రూ 1.02 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలు కాగా ఫిబ్రవరిలో మాత్రం అవి రూ. 97.247 కోట్లకే పరిమితమయ్యాయి. దీంతో ఫైనాన్స్ మినిస్ట్రీ GST వసూళ్ళ టార్గెట్‌ను తగ్గించింది. జనవరి నుండి ఫిబ్రవరి 28 వరకూ వసూలు అయిన మొత్తం వివరాలను GSTR-3B కింద ఆర్ధిక మంత్రిత్వ శాఖ నమోదు చేసింది. దీని ప్రకారం సెంట్రల్ జీఎస్టీ కింద రూ. 17,626 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ. 24,192 కోట్లు వసూలు అయ్యాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) కింద రూ. 46,953 కోట్లు, సెస్‌ కింద రూ. 8,476 కోట్లు వసూలు అయినట్టు ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఈ ఆర్ధిక సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకూ వసూలైన మొత్తం GST పన్నులు రూ. 10.70 లక్షల కోట్లు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. 
GST వసూళ్ళ టార్గెట్‌ను తగ్గించిన ప్రభుత్వం:
ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తం మీద జీఎస్టీ వసూళ్ళ టార్గెట్ 13.71 లక్షల కోట్లుగా ఉండగా.. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ టార్గెట్‌ను రూ. 11.47 లక్షల కోట్లకు తగ్గించింది. రానున్న ఆర్ధిక సంవత్సరం 2019-2020 కి గానూ GST కలెక్షన్ టార్గెట్ రూ. 13.71 లక్షల కోట్లుగా నిర్ణయించింది. కేంద్రంలో మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో పన్ను వసూళ్ళ టార్గెట్లను తగ్గించినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

 



Most Popular