క్యూ3, ఎఫ్‌పీఐల దన్ను- బాటా భళా

క్యూ3, ఎఫ్‌పీఐల దన్ను- బాటా భళా

కొత్త ఏడాది(2019)లోనూ ర్యాలీ బాటలో సాగుతున్న ఫుట్‌వేర్‌ దిగ్గజం బాటా ఇండియా కౌంటర్‌ వారాంతాన మరోసారి లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఇంట్రాడేలో రూ. 1320 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. చివరికి 2.2 శాతం పుంజుకుని రూ. 1311 వద్ద ముగిసింది. ఫలితంగా 2019లో 17 శాతంపైగా లాభపడినట్లయ్యింది. గత నాలుగు నెలల కాలాన్ని పరిగణిస్తే ఈ కౌంటర్ మరింత అధికంగా 50 శాతం దూసుకెళ్లింది. ఇందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన పటిష్ట ఫలితాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు సహరించాయి. వివరాలు చూద్దాం..

ఫలితాలు భేష్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బాటా ఇండియా నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 103 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 674 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 4.5 శాతం ఎగసి 21 శాతాన్ని తాకాయి. కాగా.. క్యూ3లో ఎఫ్‌పీఐలు బాటా ఇండియాలో దాదాపు 1.6 శాతం వాటాను తాజాగా కొనుగోలు చేశారు. దీంతో కంపెనీలో ఎఫ్‌పీఐల వాటా 6.19 శాతం నుంచి 8.78 శాతానికి పెరిగింది. ఈ బాటలో కంపెనీలో మొత్తం సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 31.79 శాతం నుంచి 32.71 శాతానికి పెరిగింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకావడం విశేషమని నిపుణులు పేర్కొన్నారు. Most Popular