సుజ్లాన్‌, జీవీకే -కొనుగోళ్ల కిక్‌

సుజ్లాన్‌, జీవీకే -కొనుగోళ్ల కిక్‌

రెండు రోజులుగా జోరందుకున్న పవన విద్యుత్‌ సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ కౌంటర్‌ వారాంతాన మరోసారి వెలుగులోకి వచ్చింది. మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో 26 శాతం దూసుకెళ్లింది. రూ. 5.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 6 వరకూ ఎగసింది. కాగా.. బుధవారం ధర రూ. 3.65తో పోలిస్తే గత రెండు రోజుల్లో ఈ కౌంటర్‌ 55 శాతం వరకూ జంప్‌చేసింది. శుక్రవారం ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి 9.8 కోట్లకుపైగా షేర్లు చేతులు మారడం విశేషం! రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వ్యాపించిన పుకార్ల నేపథ్యంలో సుజ్లాన్‌ ఎనర్జీ షేరు ఈ నెల 5న 43 శాతం కుప్పకూలింది. రూ. 2.70 వద్ద సరికొత్త కనిష్టాన్ని తాకింది. తదుపరి కంపెనీ యాజమాన్యం ఈ అంశంపై వివరణ ఇచ్చాక షేరు కోలుకుంటూ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

Image result for gvk power & infrastructure ltd

జీవీకే పవర్‌
సుజ్లాన్‌ బాటలోనే హైదరాబాద్‌ సంస్థ జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్‌ సైతం రెండు రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. గురువారం 11 శాతంపైగా లాభపడిన ఈ షేరు శుక్రవారం మరోసారి 20 శాతం ఎగసింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 7.35 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. వెరసి రూ. 5.63 ధర నుంచి రెండు రోజుల్లో 31 శాతంపైగా దూసుకెళ్లింది. కాగా.. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి ఈ కౌంటర్లో 1.7 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం!Most Popular