2 నెలలుగా దూకుడు- సీమెక్

2 నెలలుగా దూకుడు- సీమెక్

ఇటీవల కొద్ది రోజులుగా దూకుడు చూపుతున్న షిప్పింగ్‌ కంపెనీ సీమెక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వారాంతాన మరోసారి లాభాల దౌడు తీసింది, ఎన్‌ఎస్‌ఈలో ఇంట్రాడేలో 12 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 363ను తాకింది. తద్వారా 2000 ఫిబ్రవరి 18న సాధించిన సరికొత్త గరిష్టం రూ. 385కు చేరువైంది. చివరికి 4 శాతం ఎగసి రూ. 336 వద్ద ముగిసింది. ఈ కౌంటర్‌ గత రెండు నెలల్లోనూ 70 శాతం జంప్‌చేయడం విశేషం. ఇతర వివరాలు చూద్దాం...

విలీనంపై వెనకడుగు
హెచ్‌ఏఎల్‌ ఆఫ్‌షోర్‌కు చెందిన ఈపీసీ, వెసల్‌ విభాగాలను విడదీసి సీమెక్‌లో విలీనం చేసే ప్రతిపాదనపై బోర్డు వెనకడుగు వేసింది. ఈ నె 2న సమావేశమైన బోర్డు హెచ్‌ఏఎల్‌ విభాగాలను విలీనం చేయడంవల్ల ఆశించిన వ్యాపార లబ్ది చేకూరదని భావించింది. దీంతో ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడానికి నిర్ణయించింది. ఇది వాటాదారులకు మేలు చేకూర్చదని బోర్డు అభిప్రాయపడటమే దీనికి కారణంకాగా.. మరోవైపు ఈ ఏడాది(2018-19) క్యూ3లో సీమెక్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. ప్రధానంగా అండర్‌వాటర్‌, సబ్‌సీ ఇంజినీరింగ్‌ సర్వీసులందించే  సీమెక్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 36 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 8 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 39 కోట్ల నుంచి రూ. 99 కోట్లకు ఎగసింది. దీంతో ఈ కౌంటర్‌ ఇటీవల జోరందుకున్నట్లు విశ్లేషకులు వివరించారు.Most Popular