గత వారం ఫ్లాట్‌- చిన్న షేర్లు జూమ్‌

గత వారం ఫ్లాట్‌- చిన్న షేర్లు జూమ్‌

గడిచిన వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వారం మొదట్లో నష్టాలు నమోదుచేసుకోగా.. మధ్యలో వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. లాభాల బాటపట్టాయి. చివరికి నికరంగా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వెరసి గత వారం(18-22) సెన్సెక్స్‌  స్వల్పంగా 62 పాయింట్ల(0.2 శాతం) లాభంతో 35,871 వద్ద నిలిచింది. అయితే నిఫ్టీ కొంత అధికంగా 67 పాయింట్లు(0.65 శాతం) జమ చేసుకుని 10,792 వద్ద స్థిరపడింది. 

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అప్‌
మార్కెట్లను మించుతూ గత వారం చిన్న షేర్లకు డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.65 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 2 శాతం ఎగసింది. గత వారం సుజ్లాన్‌ 69 శాతం దూసుకెళ్లగా.. రిలయన్స్ నిప్పన్, కార్పొరేషన్‌ బ్యాంక్‌, వెల్‌స్పన్ కార్ప్‌,  మ్యాగ్మా ఫిన్‌, ఆర్‌కామ్, ఆర్‌నావల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, జిందాల్‌ స్టీల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, శ్రీరామ్‌ సిటీ, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, డిష్‌ టీవీ, దివాన్‌ హౌసింగ్‌, మిండా ఇండస్ట్రీస్‌, గేట్‌వే, ఐనాక్స్ విండ్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, 3ఎం, ఆర్‌పవర్‌, ఆర్‌కేపిటల్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఇమామీ, బీఏఎస్‌ఎఫ్‌ తదితరాలు 30-10 శాతం మధ్య జంప్‌చేశాయి.   

Image result for F&O closing

వేదాంతా జోరు
నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా 15 శాతం దూసుకెళ్లగా.. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, హిందాల్కో, బీపీసీఎల్‌ 8-5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌ 5 శాతం పతనమైంది. కాగా.. చిన్న షేర్లలో కావేరీ సీడ్‌ 17 శాతం కుప్పకూలింది. ఈ బాటలో ఇన్ఫీబీమ్‌, ఫినొలెక్స్‌, రాడికో ఖైతాన్‌, పెర్సిస్టెంట్‌, క్రిసిల్‌, ఒరాకిల్‌, హెచ్‌ఈజీ, ఎంవోఐఎల్‌, సనోఫీ, రెప్కో హోమ్‌, ఎంఫసిస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌, అరవింద్‌ తదితరాలు 9-4 మధ్య పతనమయ్యాయి.Most Popular