కావేరీ... కోలుకున్నట్లే కోలుకుని..

కావేరీ... కోలుకున్నట్లే కోలుకుని..

ఇప్పటికి వరుసగా 6 రోజుల పాటు నష్టాలను నమోదు చేస్తున్న కావీ సీడ్ కంపెనీ... ఏడో రోజూ అదే ట్రెండ్‌లో ఉంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన ఈ స్టాక్, ప్రస్తుతం ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. గరిష్టంగా 1.5 శాతం నష్టపోయి రూ. 410.50కు చేరుకోగా... ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 0.96 శాతం నష్టంతో రూ. 412.65 వద్ద ట్రేడవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 విత్త కంపెనీల లైసెన్స్‌లను సస్పెండ్ చేయడం... బడ్జెట్ చేయబడిన అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని... ఎక్స్‌ఛేంజీలకు కావేరీ సీడ్ కంపెనీ వివరణనిచ్చింది. దీని తర్వాత, స్టాక్‌లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. 30 రోజుల సగటుతో పోల్చితే వాల్యూమ్స్ 2.6 రెట్లు అధికంగా నమోదవుతున్నాయి.Most Popular