నేలచూపులతోనే- యూరప్‌ ఫ్లాట్‌

నేలచూపులతోనే- యూరప్‌ ఫ్లాట్‌

ప్రారంభంలో కొద్ది నిమిషాలు మాత్రమే సానుకూలంగా కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి నష్టాల బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో మరోసారి నేలచూపులకే పరిమితమై కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 251 పాయింట్లు క్షీణించి 35,558కు చేరింది. నిఫ్టీ సైతం 70 పాయింట్ల వెనకడుగుతో 10,654 వద్ద ట్రేడవుతోంది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ ఊపందుకున్నాయి. ఇక ప్రస్తుతం యూరోపియన్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. రెండు వారాలుగా సెంటిమెంటు బలహీనపడటంతో దేశీయంగా ట్రేడర్లు అమ్మకాలకే మొగ్గుచూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

రియల్టీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ రంగాలు 1.2-0.6 శాతం మధ్య క్షీణించగా, రియల్టీ 1.25 శాతం లాభపడింది. నిఫ్టీ దిగ్గజాలలో టీసీఎస్‌, యస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌,  హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, బజాజ్ ఆటో, ఐటీసీ, ఆర్‌ఐఎల్‌ 3-1.4 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 3.5 శాతం లాభపడగా.. ఓఎన్‌జీసీ, యాక్సిస్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ 1.7-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. రియల్టీ స్టాక్స్‌లో ప్రెస్టేజ్‌, ఒబెరాయ్‌, శోభా, ఇండియాబుల్స్‌, బ్రిగేడ్‌, సన్‌టెక్‌ 5-0.6 శాతం మధ్య ఎగశాయి. 

కేపీఐటీ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో కేపీఐటీ 11.5 శాతం పతనంకాగా.. ఐడీబీఐ, రెప్కో హోమ్‌, టాటా పవర్, ఇండిగో, చోళమండలం, ఇన్‌ఫీబీమ్‌, అదానీ పవర్, అంబుజా సిమెంట్‌, జైన్‌ ఇరిగేషన్‌ 6.4-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క డిష్‌ టీవీ, ఆర్‌కామ్‌, ఆర్‌పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, దివాన్‌ హౌసింగ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, శ్రేఈ ఇన్‌ఫ్రా, జూబిలెంట్‌ ఫుడ్‌, స్టార్‌ 11-2 శాతం మధ్య జంప్‌చేశాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నీరసంగా కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్న తరహా షేర్లలోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1613 నష్టపోగా.. 838 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. Most Popular