డాక్టర్‌ రెడ్డీస్‌ జూమ్‌ -యస్‌బ్యాంక్‌ నో

డాక్టర్‌ రెడ్డీస్‌ జూమ్‌ -యస్‌బ్యాంక్‌ నో

ఆంధ్రప్రదేశ్‌లోని దువ్వాడ ప్లాంటుకి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి లోపాలులేని నివేదిక(ఈఐఆర్‌) లభించినట్లు వెల్లడించడంతో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ కౌంటర్ లాభాలతో కళకళలాడుతోంది. మరోపక్క మొండిబకాయిల గుర్తింపు, ప్రొవిజన్ల అంశంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు ఇచ్చిన (నిల్‌ డైవర్జెన్స్‌) నివేదికను బహిర్గతం చేయడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ అక్షింతలు వేసిన నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం...

డాక్టర్ రెడ్డీస్‌ లేబ్

దువ్వాడ ప్లాంటులో గతేడాది అక్టోబర్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్వహించిన తనిఖీలు విజయవంతంగా ముగిసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తాజాగా వెల్లడించింది. దీంతో యూఎస్‌కు ఎగుమతులు చేపట్టే ఈ ప్లాంటుకి ఈఐఆర్‌ లభించినట్లు తెలియజేసింది. ఫలితంగా డాక్టర్‌ రెడ్డీస్‌ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 2656 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2690 వరకూ ఎగసింది. కాగా.. హైదరాబాద్‌లోని బాచుపల్లి ఫార్ములేషన్ల ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్ఎఫ్‌డీఏ గత వారం ఫామ్‌ -483ని జారీ చేసినట్లు వెల్లడికావడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలకు ఎగబడటంతో ఒక దశలో ఈ షేరు ఏకంగా 30 శాతం కుప్పకూలింది. గత 17 ఏళ్లలోనే ఇది అత్యంత నష్టంకాగా.. చివరికి కోలుకుంది. ఎన్‌ఎస్ఈలో శుక్రవారం డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 4 శాతం పతనమై రూ. 2563 వద్ద ముగిసింది.

Image result for ye bank

యస్‌ బ్యాంక్‌
ఆర్‌బీఐ నుంచి నో డైవర్జెన్స్‌ నివేదికను పొందినట్లు వెల్లడించడంతో గతవారం దూకుడు చూపిన యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో తాజాగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. రహస్యంగా ఉంచాల్సిన నివేదికను బహిరంగపరచడాన్ని ఆర్‌బీఐ తప్పుపట్టడంతోపాటు ఇతర వ్యవహారాలలో బ్యాంక్‌ సక్రమంగా వ్యవహరించని అంశాలు ఏఏఆర్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఈ అంశంపై తగిన చర్యలు చేపట్టనున్నట్లు ఆర్‌బీఐ హెచ్చరించింది. దీంతో ఈ కౌంటర్లో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 4.5 శాతం పతనమై రూ. 209 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 201 వరకూ దిగజారింది. Most Popular