మాల్యా కేసులో డెక్కన్ ఏవియేషన్ అధినేత గోపీనాథ్‌పై CBI ఆరా..?

మాల్యా కేసులో డెక్కన్ ఏవియేషన్ అధినేత గోపీనాథ్‌పై CBI ఆరా..?

బ్యాంకులకు వేల కోట్ల రుణ ఎగవేతదారుడిగా ముద్ర పడ్డ కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేశాయి. బ్రిటన్‌ నుండి మాల్యాను వెనక్కి రప్పించే యత్నాలు పుంజుకోడంతో ఈ కేసులో మిగతా వ్యక్తుల ప్రమేయంపై ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రముఖ ఎవియేషన్ సంస్థ, స్వల్ప ధరల విమానయానానికి అద్యుడు అయిన డక్కన్ ఏవియేషన్ లిమిటెడ్ అధినేత GR. గోపీనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. విజయ్ మాల్యా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను అక్రమంగా వేరే అవసరాలకు మళ్ళించడంలో గోపీనాథ్ పాత్రపై సీబీఐ ఆరా తీస్తున్నట్టు విచారణ వర్గాలు పేర్కొంటున్నాయి. 

1
2007లో తన డెక్కన్ ఏవియేషన్ కంపెనీని విజయ్‌మాల్యకు విక్రయించిన గోపీనాథ్ అప్పటి నుండి కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ బోర్డులో డైరెక్టర్‌గా కొనసాగారు. యాక్సిస్ బ్యాంక్ ఖాతాల ద్వారా SBI ఇచ్చిన రూ.340 కోట్ల రుణాలను మళ్ళించారన్నది గోపీనాథ్‌పై ఉన్న ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ఈ నిధుల మళ్ళింపుకు ప్రతిఫలంగా కింగ్ ఫిషర్ సంస్థ గోపీనాథ్‌కు ఫిబ్రవరి 2008లో రూ. 30 కోట్లు చెల్లించడం కూడా అనుమానస్పదంగా ఉందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఎస్బీఐ నుండి డెక్కన్ ఏవియేషన్ లిమిటెడ్ (DAL)కు రూ. 340 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అప్పుడు అధీకృత యాజమానిగా గోపీనాథ్ రుణ ఒప్పందంపై సంతకం కూడా పెట్టారు. ఈ రుణ మొత్తాన్ని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇతర అవసరాలకు వాడుకునేలా గోపీనాథ్ దుర్వినియోగ పరిచారని, అందుకు ప్రతిఫలంగా కింగ్ ఫిషర్ నుండి రూ. 30 కోట్ల చెల్లింపులను పొందారని ది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(SFIO) అనుమానిస్తుంది. దీనిపై 2017లో ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇచ్చిన నివేదికలో గోపీనాథ్‌కు చెల్లింపులపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. వాటాదారులకు తెలియకుండా, హైకోర్టుకు తెలియపరచకుండా రూ. 30 కోట్లు ఎలా చెల్లించారన్నది దర్యాప్తు సంస్థల అనుమానానికి కారణంగా తెలుస్తుంది. SFIO ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ , డెక్కన్ ఏవియేషన్ కంపెనీలు కార్పోరేట్ ఎథిక్స్ ను తుంగలో తొక్కాయని, వాటాదారులు, రుణదాతల సొమ్మును ఇతర అవసరాలకు మళ్ళించారని పేర్కొంది. కాగా ఈ విషయంపై గోపీనాథ్ వివరణ కోరడానికి యత్నించగా ఆయన స్పందిచలేదని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. 
Image result for deccan aviation gopinath with mallyaMost Popular