ఎడిల్వీస్ గ్రూపుపై సెబీకి ఫిర్యాదు చేసిన అడాగ్.. !

ఎడిల్వీస్ గ్రూపుపై సెబీకి ఫిర్యాదు చేసిన అడాగ్.. !

అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ పవర్ ముంబైకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూపు ఎడిల్వీస్ పై సెబీకి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి ఎడిల్వీస్ గ్రూపును తొలగించాలంటూ సెబీకి రాసిన లేఖలో పేర్కొంది. మార్కెట్ రెగ్యులేటర్ ఎడిల్వీస్ పై చర్యలు తీసుకోవాలని, సదరు కంపెనీని కార్యకలాపాలను సెక్యూరిటీ మార్కెట్లలో నిరోధించాలని, మార్కెట్ లో ఒక కంపెనీపై బురద జల్లే కార్యక్రమం చేపట్టడం వల్ల రిలయన్స్ వపర్ షేరు ధర కేవలం 2 రోజుల్లో 57 శాతం పతనమైందని ఫిర్యాదులేఖలో పేర్కొంది. 

అంతే కాదు అడాగ్ గ్రూపు కంపెనీ షేర్ల ఆకస్మిక పతనానికి దారి తీసిన కారణాలపై సెబీ దర్యాప్తు జరపాలని కూడా పేర్కొంది. అవసరమైతే కంపెనీ బోర్డు సమావేశాలు, అలాగే అన్ని బ్రోకింగ్ ఏజెన్సీల ఫోన్ కాల్స్, బల్క్ ఎస్సెమ్మెస్‌లను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు జరపాలని అలాగే భారీగా పతనానికి దారితీసిన బల్క్ డీల్స్, లావాదేవీలపై కూడా విచారణ జరపాలని సెబీకి ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొంది. 

ఇదిలా ఉంటే అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన కంపెనీల్లో దివాలా ప్రక్రియ ప్రారంభమైందనే వార్తలతో కంపెనీ షేర్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆర్ కామ్, రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు భారీగా అమ్మకాలకు లోనయ్యాయి. కానీ, అడాగ్ గ్రూపు కంపెనీలతో బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఎలాంటి దివాలా ప్రక్రియ ప్రారంభించలేదని తేలింది. 

అయితే ఈ గందరగోళం దారి తీయడం వెనుక ఎడిల్వీస్ సంస్థ కంపెనీ షేర్లు భారీగా అమ్మకాలకు లోనయ్యేలా పావులు కదిపిందని ఫిర్యాదులో తెలిపింది. మార్కెట్ ధర కన్నా అతి తక్కువ ధరతో అమ్మకాలు జరిపిందని, ఫలితంగా షేర్ ధర భారీగా పతనమైందని తెలిపింది. అయితే ఈ అమ్మకాలు కేవలం క్యాష్ మార్కెట్లోనే కాదు, డెరివేటివ్ మార్కెట్స్ లో కూడా భారీ పతనానికి ఎడిల్వీస్ కారణమైందని ఫిర్యాదులో పేర్కొంది.Most Popular