నష్టాల ముగింపు- ఐటీ ఎదురీత!

నష్టాల ముగింపు- ఐటీ ఎదురీత!

అంతర్గతంగా సెంటిమెంటు బలహీనపడటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. దీంతో రోజంతా దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ ట్రేడర్లు అప్తమత్తంగా వ్యవహరించేందుకే ప్రాధాన్యమివ్వడంతో చివరికి మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 151 పాయింట్లు క్షీణించి 36,395 వద్ద నిలవగా... నిఫ్టీ 55 పాయింట్ల వెనకడుగుతో 10,889 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో రియల్టీ రంగాలు 1.75-1 శాతం మధ్య నీరసించాయి. అయితే మీడియా 1.3 శాతం, ఐటీ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి.

Image result for pharma industry

దిగ్గజాలు డీలా
నిఫ్టీ దిగ్గజాలలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, హిందాల్కో, అల్ట్రాటెక్‌, గెయిల్‌, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్‌, వేదాంతా, బజాజ్ ఫైనాన్స్‌ 5.6-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐవోసీ, టాటా స్టీల్‌, సిప్లా, టాటా మోటార్స్‌, జీ, ఇండస్‌ఇండ్, పవర్‌గ్రిడ్, మారుతీ, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.4-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి.

చిన్న షేర్లు బోర్లా
మార్కెట్లను మించుతూ చిన్న షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.5 శాతం చొప్పున తిరోగమించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1706 నష్టపోగా.. 841 మాత్రమే లాభపడ్డాయ్‌. డెరివేటివ్స్‌లో పీసీ జ్యువెలర్స్‌, అపోలో హాస్పిటల్స్‌, నాల్కో, సుజ్లాన్‌, మ్యాక్స్‌, కజారియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఐసీఐసీఐ ప్రు, జెట్‌ ఎయిర్‌వేస్‌ 11-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోవైపు సన్‌ టీవీ 10 శాతం దూసుకెళ్లగా.. బాలకృష్ణ, అజంతా, రియలన్స్‌ కేపిటల్‌, మైండ్‌ట్రీ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 844 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 960 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 418 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 294 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. Most Popular