ఎఅండ్‌ఎం- లుమాక్స్‌ ఆటో బోర్లా

ఎఅండ్‌ఎం- లుమాక్స్‌ ఆటో బోర్లా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ట్రాక్టర్ల విక్రయాలపై అంచనాలను కంపెనీ యాజమాన్యం తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క క్యూ3లో సాధించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాలను చేరకపోవడంతో ఆటో విడిభాగాల సంస్థ లుమాక్స్‌ ఆటో టెక్నాలజీస్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. 

ఎంఅండ్‌ఎం
క్యూ4(జనవరి-మార్చి)లో ట్రాక్టర్ల అమ్మకాలు 10 శాతం వృద్ధికే పరిమితంకావచ్చంటూ మహీంద్రా అండ్‌ మహీంద్రా యాజమాన్యం తాజా అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. గతంలో వేసిన 12-14 శాతం వృద్ధి అంచనాలను దిగువముఖంగా సవరించింది. ఈ బాటలో వచ్చే ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఇంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటూ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎంఅండ్‌ఎం షేరు 5.25 శాతం పతనమై రూ. 646 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 646 దిగువన 52 వారాల కనిష్టానికి చేరింది. కాగా ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2019లో 5-6 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు ఎంఅండ్‌ఎం యాజమాన్యం అభిప్రాయపడింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కంపెనీ నికర లాభం 60 శాతం జంప్‌చేసి రూ. 1476 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 12 శాతం పెరిగి రూ. 12,892 కోట్లకు చేరింది. 

Image result for lumax auto technologies ltd

లుమాక్స్‌ ఆటో టెక్
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో లుమాక్స్‌ ఆటో టెక్ నికర లాభం 31 శాతం పుంజుకుని రూ. 17 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా పెరిగి రూ. 320 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) నామమాత్ర వృద్ధితో రూ. 28.5 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 10.1 శాతం నుంచి 8.9 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో తొలుత లుమాక్స్‌ ఆటో టెక్ షేరు 6.5 శాతం పతనమై రూ. 133 దిగువకు చేరింది. ప్రస్తుతం 2.25 శాతం నష్టంతో రూ. 139 దిగువన ట్రేడవుతోంది.Most Popular